Deepak Chahar: కెప్టెన్ విషయంలో కన్ఫ్యూజన్ ఉంది
Deepak Chahar: చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కెప్టెన్సీ విషయంలో కన్ఫ్యూజన్ ఉందని అన్నారు దీపక్ చాహర్. ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ బాధ్యతల నుంచి ఎంఎస్ ధోనీ (MS Dhoni) తప్పుకుని అందరికీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. అయితే కెప్టెన్‌గా రుతురాజ్ ఉన్నప్పటికీ సగం పనులు ధోనీనే చేస్తున్నాడని.. దాంతో టీంలో కెప్టెన్ ఎవరు అనే కన్ఫ్యూజన్ నెలకొందని దీపక్ చాహర్ అంటున్నారు. మొన్న జరిగిన రెండు ఆటల్లోనూ ఎవరి నుంచి సలహాలు తీసుకోవాలో తెలీక ఇద్దరినీ అడగాల్సి వస్తోందని తెలిపాడు.
“” ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్ విషయంలో నేను రుతురాజ్‌తో పాటు ధోనీ దగ్గరికి కూడా వెళ్లాల్సి వస్తోంది. సో.. ఇంకా రుతురాజ్ సూపర్ కింగ్స్ టీంకి పూర్తిగా కెప్టెన్ అవ్వలేదు అని చెప్పాలి. కానీ వారిద్దరూ నాకు మంచి సలహాలు ఇస్తున్నారు. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. రుతు 100 శాతం తన రోల్‌కు న్యాయం చేస్తున్నాడు “” అని తెలిపాడు.
ALSO READ: Manoj Tiwary: వాంఖెడెలో హార్దిక్ పని అయిపోయినట్లే