ధోనీ కోసం IPL పాత రూల్ తేవాల‌ని కోరిన‌ CSK

csk wants this change of rule in ipl to retain dhoni

IPL: ఐపీఎల్ 2025లో ఎంఎస్ ధోనీ ఉంటాడా లేదా అని అభిమానులు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. ఎక్క‌డ ఐపీఎల్‌కి రిటైర్మెంట్ ప్ర‌క‌టించేస్తాడో అని తెగ టెన్ష‌న్ ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఐపీఎల్ మేనేజ్‌మెంట్‌ను ధోనీని రీటైన్ చేసేందుకు ఒక ప్లాన్ చెప్పింది. ఐపీఎల్‌లో ఉన్న పాత రూల్‌ని మ‌ళ్లీ తీసుకురావాల‌ని కోరింది. ఐపీఎల్‌లో 2008 నుంచి 2021 వ‌ర‌కు ఒక రూల్ ఉండేది. క్రికెట‌ర్లు ఐదేళ్ల పాటు లేదా అంత‌కుమించి అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యుంటే వారిని ఐపీఎల్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్లుగా నియ‌మించ‌వ‌చ్చు. అయితే ఈ రూల్ ఇప్పుడు లేదు.

2022లో ధోనీని చెన్నై సూప‌ర్ కింగ్స్ రూ.12 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఈ అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్ రూల్ ఉండి ఉంటే కేవ‌లం రూ.4 కోట్లు చెల్లిస్తే స‌రిపోతుంది. ఈ రూల్‌ని మ‌ళ్లీ తెస్తే అప్పుడు ధోనీ సూప‌ర్ కింగ్స్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్‌గా ఉంటాడ‌ని.. కాస్త ఈ రూల్‌ని మ‌ళ్లీ తెచ్చేలా ప‌రిశీల‌న‌లు చేయాల‌ని ఐపీఎల్ యాజ‌మాన్యాన్ని కోరింది. అయితే ఇత‌ర ఫ్రాంచైస్ ఓన‌ర్ల‌కు ఈ పాత రూల్ ఇష్టం లేదు. పాత రూల్‌ని మ‌ళ్లీ తెస్తే రిటైర్ అయిన ప్లేయ‌ర్ల‌ను అగౌర‌వ ప‌రిచిన‌ట్లు అవుతుంద‌ని.. వారిని టీంలో ఉంచాలంటే వేలంలో మంచి ధ‌ర‌కు కొనుగోలు చేయాల్సిందేన‌ని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ య‌జ‌మాని కావ్య మార‌న్ త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు.