Brij Bhushan: ఒలింపిక్స్‌లో మోసం చేసావు కాబట్టే దేవుడు శిక్షించాడు
Brij Bhushan: పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో ఫైనల్స్ నుంచి నిషేధానికి గురైన వినేష్ ఫోగాట్‌పై విషం చిమ్మారు మాజీ రెజ్లర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించాడంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దాదాపు మూడు నెలల పాటు రెజ్లర్లు వినేష్ ఫోగాట్, సాక్షి మాలిక్, భజరంగ్ పూనియా తదితరులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేసారు. ప్రస్తుతం బ్రిజ్ భూషణ్ బెయిల్‌పై బయటికి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఆయన వినేష్ ఫోగాట్‌పై స్పందిస్తూ.. ఆమె తనపై తప్పుడు ఆరోపణలు చేసిందని ఒలింపిక్స్‌లో మోసం చేయాలనుకుంది కాబట్టే దేవుడు సరైన బుద్ధి చెప్పాడని అన్నారు.
బ్రిజ్ భూషణ్ భారతీయ జనతా పార్టీ నేత కూడా. హర్యాణా ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వినేష్‌కు జులానా సీటుకు టికెట్ కేటాయించింది. తనపై ఫోగాట్ తప్పుడు ఆరోపణలు చేసింది కాబట్టే దేవుడు ఈ రకంగా శిక్ష వేసాడని పుండు మీద కారం చల్లే వ్యాఖ్యలు చేసారు.