CSK కి బిగ్ షాక్.. రూల్ అవుట్ అయిన‌ స్టార్ ప్లేయ‌ర్

CSK: ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌కి పెద్ద షాక్ త‌గిలింది. కీల‌క ఆట‌గాడైన న్యూజిల్యాండ్ బ్యాట‌ర్ డివోన్ కాన్వే రూల్ అవుట్ అయ్యాడు. కాన్వే గాయం వ‌ల్ల చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ర‌ఫున ఇప్పటివ‌ర‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌లేదు. దాంతో అత‌ను మున్ముందు జ‌రిగే మ్యాచ్‌ల‌లో పాల్గొంటాడేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు BCCI నిర్ణ‌యం తీసుకుంటూ అత‌న్ని మొత్తానికే రూల్ అవుట్ చేసేసింది. అత‌ని స్థానంలో ఇంగ్లాండ్ పేస‌ర్ రిచ‌ర్డ్ గ్లీస‌న్‌ను ఎంపిక‌చేసారు. చెన్నై సూప‌ర్ కింగ్స్ గెలిచిన టైటిల్స్‌లోని రెండు సీజ‌న్ల‌లో కాన్వే ఆడాడు. ఇక కాన్వే రీప్లేస్మెంట్‌గా వ‌చ్చిన గ్లీస‌న్ ఇంకా ఐపీఎల్ రుచి చూడాల్సి ఉంది.

ALSO READ:

CSK: రుతు కెప్టెన్సీ టీంకు నచ్చ‌లేదా?

Ravi Shastri: ఇది ధోనీ లాస్ట్ సీజ‌న్.. ర‌విశాస్త్రి షాకింగ్ కామెంట్స్