BCCI: సారీ హార్దిక్.. నువ్వు కెప్టెన్ కాదు

bcci informs hardik pandya that he will not be the captain

BCCI: బీసీసీఐ హార్దిక్ పాండ్య‌కు చివ‌రి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చింది. టీమిండియా కోచ్ గౌత‌మ్ గంభీర్, సెలెక్ట‌ర్ అజిత్ అగార్క‌ర్ ఈరోజు పాండ్య‌ను క‌లిసారు. ప్ర‌పంచ క‌ప్ వ‌ర‌కు T20I టోర్న‌మెంట్‌కు కెప్టెన్‌గా ఎంపిక‌చేయ‌లేం అని పాండ్య‌కు చెప్పారు. ఇందుకు పాండ్య కూడా ఒప్పుకున్నాడు. దాంతో ఇప్పుడు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ అందుబాటులో లేక‌పోవ‌డంతో కెప్టెన్సీ బాధ్య‌త‌లు సూర్య కుమార్ యాద‌వ్‌కు అప్ప‌గించే అవ‌కాశం ఉంది.

అంతేకాదు.. ఈ ఏడాది ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ త‌ర‌ఫున ఆడిన హార్దిక్ పాండ్య త‌న పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొన్నాడు. దాంతో త‌ర‌చూ విజ‌య్ హ‌జారే ట్రోఫీ వంటి డొమెస్టిక్ క్రికెట్ ఆడుతూ ఉండాల‌ని కూడా గంభీర్ అగార్క‌ర్ పాండ్యకు చెప్పారు. మ‌రోప‌క్క ODI శ్రీలంక సిరీస్ నుంచి తొలి మూడు మ్యాచ్‌లు ఆడ‌లేనని సెల‌వు కావాల‌ని పాండ్య కోరాడు. ఇందుకు మేనేజ్‌మెంట్ ఒప్పుకుంది. దాంతో శ్రీలంక టూర్‌కి శుభ్‌మన్ గిల్‌ని కానీ కేఎల్ రాహుల్‌ని కానీ కెప్టెన్‌ని చేసే అవ‌కాశం ఉంది.