Basit Ali: విరాట్ కోహ్లీ క్రికెట్ కింగ్ కాదు

basit ali says virat kohli is not king of cricket

Basit Ali: విరాట్ కోహ్లీని అంద‌రూ కింగ్ ఆఫ్ క్రికెట్ అంటారు. కానీ మాజీ పాకిస్థాన్ క్రికెట‌ర్ బ‌సిత్ అలి మాత్రం కోహ్లీ క్రికెట్ కింగ్ కాద‌ని.. కేవ‌లం బెస్ట్ క్రికెట‌ర్ అని అన‌డం వివాదాస్ప‌దంగా మారింది. కోహ్లీకి ఉన్న ఫిట్‌నెస్, నిబ‌ద్ధ‌త‌తో మ‌రో మూడేళ్లు క్రికెట్ ఆడ‌గ‌ల‌డ‌ని తెలిపారు. స‌చిన్ తెందుల్క‌ర్, డాన్ బ్రాడ్మాన్ లాంటి లెజండ‌రీ ఆట‌గాళ్లే కేవ‌లం క్రికెట‌ర్లుగా గుర్తింప‌బడుతున్నార‌ని.. అలాంటిది కోహ్లీని కింగ్ అన‌డంలో అర్థం లేద‌ని తెలిపారు. ఈ విష‌యాన్ని తాను చెప్ప‌డం లేద‌ని కోహ్లీనే స్వ‌యంగా త‌న‌ను కింగ్ అన‌డం ఇష్టం లేద‌ని త‌న ఉద్దేశంలో కింగ్ అంటే క్రికెట్ మాత్ర‌మే అని చాలా సార్లు అన్నాడ‌ని.. అలాంట‌ప్పుడు కోహ్లీని కింగ్ అని ఎందుకు పిలుస్తున్నార‌ని అన‌డం వైర‌ల్‌గా మారింది. భార‌తీయ క్రికెట‌ర్లు యంగ్ ఆట‌గాళ్ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌నుకుంటార‌ని కానీ పాకిస్థానీ క్రికెట‌ర్లు మాత్రం ఎక్క‌డ త‌మ అవ‌కాశాలు యంగ్ ఆట‌గాళ్ల‌కు వెళ్లిపోతాయో అని భ‌య‌ప‌డుతుంటార‌ని ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు.