Bangladesh: ఇంకా అయిపోలేదు.. T20 వ‌రల్డ్ క‌ప్‌కి వ‌స్తాం

bangladesh tamim iqbal says we will come to india for t20 world cup

Bangladesh: ఇండియా బంగ్లాదేశ్ సిరీస్ మ్యాచ్‌లో విజ‌యం టీమిండియానే వ‌రించింది. బంగ్లాదేశ్ చేతులెత్తేయ‌డంతో భార‌త్ గెలిచేసింది. అయితే ఓడిపోయిన త‌ర్వాత బంగ్లాదేశ్ ఆట‌గాడు త‌మీమ్ ఇక్బాల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. అప్పుడే అయిపోలేదు. 2026లో జ‌ర‌గ‌బోయే T20 ప్ర‌పంచ క‌ప్‌కు మ‌ళ్లీ భారత్ వ‌స్తాం అని ఆయన వ్యాఖ్యానించ‌డం వైర‌ల్‌గా మారింది. ఈ సిరీస్‌లో టీమిండియా నుంచి బంగ్లాదేశ్ చాలా నేర్చుకుంద‌ని వీటిని దృష్టిలో పెట్టుకుని 2026లో T20 ప్ర‌పంచ క‌ప్ కోసం ఇంకా బాగా ప్రిపేర్ అవుతామ‌ని అన్నాడు. ఇప్పుడు టీమిండియా గురించి త‌మ‌కు ఒక క్లారిటీ వ‌చ్చింది కాబ‌ట్టి ఈసారి ఇంకా బాగా ప్లాన్ చేసుకుని మళ్లీ భార‌త్‌లో అడుగుపెడ‌తామని తెలిపాడు.