Vinesh Phogat Dismissal: ఫోగాట్ నాటకాలాడుతోంది.. భారత్ ఎప్పటికీ అలా చేయదు
Vinesh Phogat Dismissal: ఒలింపిక్స్ రెజ్లింగ్ పోటీల్లో భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగాట్ విషయంలో చివరి నిమిషంలో మెడల్ చేజారే పరిస్థితి ఏర్పడింది. 50 కిలోల బరువు ఉండాల్సిన ఫోగాట్ 100 గ్రాములు అధికంగా ఉండటంతో ఆమెను ఫైనల్స్ నుంచి డిస్‌క్వాలిఫై చేసారు. అయితే వినేష్ విషయంలో రాజకీయ కుట్ర ఉందని బాక్సర్ విజేందర్ సింగ్ ఆరోపించారు. భారతీయ జనతా పార్టీకి చెందిన రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ షరణ్ సింగ్ లైంగిక దాడులను వినేష్ బయటపెట్టిందన్న కోపంతో ఆమెను ఫైనల్స్‌కి వెళ్లనివ్వకుండా చేసారని.. ఒక్క రోజులో 5 నుంచి 6 కిలోలు తగ్గచ్చని అలాంటిది 100 గ్రాములు తగ్గడంలో వినేష్ ఎందుకు విఫలమైందో తెలీడంలేదని విజేందర్ అన్నారు.
కావాలనే లేనిపోని రూల్స్ పెట్టి వినేష్‌ను ఫైనల్స్‌కు వెళ్లనివ్వకుండా చేసారని ఆయన విమర్శలు గుప్పించారు. దీనిపై అథ్లెట్స్ బాడీ చీఫ్ అదిల్ సుమారీవాలా స్పందించారు. వినేష్ కావాలనే నాటకాలు ఆడుతోందని.. రూల్స్ ప్రకారం ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువ ఉంటే పాల్గొనలేరని.. కాకపోతే ఆ అథ్లెట్ సెమీ ఫైనల్‌లో గాయపడితే గ్రేస్ పీరియడ్ ఇస్తామే తప్ప కేవలం ఫైనల్స్‌లో పాల్గొనేందుకు 100 గ్రాములు తగ్గుతాను అంటే ఎవ్వరూ ఒప్పుకోరని మండిపడ్డారు. ఇలాంటి కుట్రలకు భారత్ ఎప్పుడూ పాల్పడదని.. వినేష్ ఎందుకు ఫైనల్స్‌కి వెళ్లేలకపోయింది అంటే దానికి ఆన్సర్ ఆమె 100 గ్రాములు ఎక్కువ బరువు ఉండటమే అని అదిల్ అన్నారు. ఇందులో కుట్ర ఏముందో తనకు అర్థంకావడంలేదని తెలిపారు. వినేష్‌ను బరువు తగ్గించేందుకు ఆమెతో పాటు డాక్టర్లు, ట్రైనర్లు రాత్రంతా మేలుకుని ఉన్నారని.. ఆ 100 గ్రాములు తగ్గించేందుకు వినేష్ జుట్టును కూడా కత్తిరించారని కాబట్టి ఆమెపై అనర్హత వేటు పడిందని అన్నారు.