Hardik Pandya: విడాకులు తీసుకున్న పాండ్య నటాషా దంపతులు!?
Hardik Pandya: స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్య నటాషా దంపతులు విడాకులు తీసుకున్నారా? ప్రముఖ సోషల్ మీడియా యాప్ రెడిట్‌లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో అయ్యారని.. ఇద్దరూ విడి విడిగా ఉంటున్నారనే టాక్ నడుస్తోంది. అంతేకాదు.. సోషల్ మీడియాలో నటాషా స్టాంకోవిక్ పాండ్య పేరు నుంచి పాండ్య పేరును తొలగించేసింది. ఏ ఐపీఎల్ మ్యాచ్‌లో కూడా కనిపించలేదు. పాండ్య ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక చాలా మంది నటాషాను ట్రోల్ చేసారు.
ఆమె పట్ల అసభ్యకరమైన పదజాలాన్ని వాడారు. ఆ కోపంతోనే నటాషా ఏ మ్యాచ్‌లకు హాజరుకాలేదని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడ మ్యాటర్ వేరే ఉందని తెలుస్తోంది. అంతేకాదు.. సోషల్ మీడియాలో వీరిద్దరూ ఒకరి గురించి మరొకరు ఎలాంటి పోస్ట్‌లు పెట్టడంలేదు. మార్చి 4న నటాషా పుట్టినరోజు. నటాషా ప్రతి పుట్టినరోజున పాండ్య కేక్ కట్ చేసిన ఫోటోలు, పార్టీ స్టిల్స్ షేర్ చేసేవాడు. కానీ ఈసారి అలా చేయలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే వీరిద్దరూ విడిపోయారనే చెప్పాలి.
నటాషా సెర్బియాకు చెందిన మోడల్. బాలీవుడ్లో అవకాశాల కోసం ముంబై వచ్చింది. పాండ్య నటాషాను ఓ పబ్‌లో చూసాడట. అప్పుడే ఆమెపై మనసు పారేసుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరూ కొంత కాలం పాటు డేటింగ్ చేసారు. పెళ్లి కాకుండానే నటాషా గర్భం దాల్చడంతో పాండ్య తల్లిదండ్రులు ముందు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఆ తర్వాత దగ్గరుండి వీరి వివాహాన్ని హిందూ క్రైస్తవ సంప్రదాయాల్లో జరిపించారు. వీరికి అగస్త్య పాండ్య అనే కుమారుడు ఉన్నాడు.