Ambati Rayudu: ద‌మ్ముంటే ఇప్పుడు పాండ్య‌ను తిట్టండ్రా..!

Ambati Rayudu

Ambati Rayudu:  ద‌మ్ముంటే ఇప్పుడు హార్దిక్ పాండ్య‌ను తిట్టండ్రా అని గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు మాజీ క్రికెట‌ర్ అంబ‌టి రాయుడు. మొన్న జ‌రిగిన టీ20 ఫైన‌ల్ మ్యాచ్‌లో హైన్రిచ్ క్లాసెన్‌ను 17వ ఓవ‌ర్‌లో ఓడ‌గొట్టిన హార్దిక్ పాండ్య‌.. టీమిండియా క‌ప్ గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్‌గా పేల‌వ ప్ర‌ద‌ర్శ‌నతో అంద‌రి నుంచి దారుణ‌మైన అవ‌మానాలు ట్రోల్స్ ఎదుర్కొన్న హార్దిక్ పాండ్య స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు త‌న స‌త్తా చాటాడు.

దీనిపై అంబ‌టి రాయుడు స్పందిస్తూ.. “” ద‌మ్ముంటే ఇప్పుడు అనండ్రా పాండ్య‌ను. ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొని స్ట్రాంగ్‌గా నిల‌బ‌డి మ‌రీ టీమిండియాను గెలిపించాడు. పాండ్య ఎంత మంచి ఆట‌గాడో అంత‌కంటే ఎంత మంచి వ్య‌క్తో నాకు బాగా తెలుపు. నేను పాండ్య‌తో క‌లిసి ఆడాను. ఇప్పుడు పాండ్య ప్ర‌పంచ ఛాంపియ‌న్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు “” అని రాయుడు తెలిపారు.