Ambati Rayudu: ధోనీ కోసం అరుపులు.. నేను జ‌డేజా ఎంతో బాధ‌ప‌డ్డాం

Ambati Rayudu says he and jadeja felt frustrated when crowd wont cheer for them

Ambati Rayudu:  ఎంత మంది లెజెండరీ క్రికెట‌ర్లు ఉన్నా మ‌హేంద్ర సింగ్ ధోనీకి (MS Dhoni) ఫ్యాన్స్‌లో క్రేజ్ వేరే లెవెల్. చెన్నై సూప‌ర్ కింగ్స్‌లో (Chennai Super Kings) ధోనీ ఉన్నాడు కాబ‌ట్టే ఆ టీంని ఇష్ట‌ప‌డే వారు ఉన్నారు అన‌డంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ విష‌యాన్ని తాను కూడా అంగీక‌రిస్తాన‌ని అంటున్నాడు అంబ‌టి రాయుడు.

ఒక‌ప్పుడు చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ర‌ఫున ఆడిన రాయుడు…. ధోనీ సిక్సులు కొడితేనే జ‌నాలు అరిచేవారని.. తాను కానీ ర‌వీంద్ర జ‌డేజా కానీ ఎంత బాగా పెర్ఫామ్ చేసినా ఎవ్వ‌రూ క‌నీసం చ‌ప్ప‌ట్లు కొట్టేవారు కాద‌ని అన్నారు. ఈ విష‌యంలో తాను జ‌డేజా ఎంతో బాధ‌ప‌డేవాళ్ల‌మ‌ని కానీ ఈ విష‌యంలో తాము చేయ‌గ‌లిగింది ఏమీ లేద‌ని అన్నారు. ఈ విష‌యంలో జ‌డేజా ఫీల్డ్‌లోనే చాలా సార్లు కోప‌గించుకున్నాడ‌ని.. అభిమానులు ఇలా చేయ‌డం వ‌ల్ల టీంలోని ఇత‌ర ఆట‌గాళ్లకు ఆడాల‌న్న ఉత్సాహం కూడా రాద‌ని అన్నారు.