Ambati Rayudu: MI కంటే బాగా చూసుకునే టీంలోకే రోహిత్ వెళ్తాడు
Ambati Rayudu: ముంబై ఇండియన్స్ (Mumbai Indians) మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఏ టీంలోకి వెళ్లబోతున్నారా అనే చర్చ మొదలైంది. చాలా మంది రోహిత్ ముంబై ఇండియన్స్‌ను వదిలేసి ఢిల్లీ క్యాపిటల్స్‌కి (Delhi Capitals) వెళ్లనున్నాడని అంటున్నారు. మరోపక్క లఖ్నౌ సూపర్ జైంట్స్ (Lucknow Super Giants) హెడ్ కోచ్ జస్టిస్ లంగర్ (Justice Langer) కూడా రోహిత్ తన టీంలోకి వస్తే బాగుంటుందని తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఇంకోపక్క 2025 IPL కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) యజమాని కావ్య మారన్ రోహిత్ శర్మకు బ్లాంక్ చెక్ ఇచ్చి మరీ ఐదేళ్ల పాటు కాంట్రాక్ట్ రాయించుకోవాలని అనుకుంటున్న టాక్ కూడా వినిపిస్తోంది.
అయితే రోహిత్ టీం మారే అంశంపై అంబటి రాయుడు సర్ప్రైజింగ్ కామెంట్స్ చేసారు. రోహిత్‌ను తీసుకోవడానికి చాలా టీమ్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని.. రోహిత్ కచ్చితంగా ముంబై ఇండియన్స్ కంటే తనను ఎక్కువగా గౌరవించే టీంలోకే వెళ్తాడని.. చివరి నిర్ణయం మాత్రం రోహిత్‌దే అని అన్నారు.
ముంబై ఇండియన్స్‌కి హార్దిక్ పాండ్య కెప్టెన్ అవ్వడంతో ముసలం నెలకొన్న సంగతి తెలిసిందే. హార్దిక్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ అవ్వడం రోహిత్ అభిమానులకే కాదు.. టీంలోని చాలా మంది ఆటగాళ్లకు కూడా ఇష్టం లేదనే టాక్ నడుస్తోంది. ఐదు ఐపీఎల్ టైటిల్స్ సాధించిన కెప్టెన్‌గా రోహిత్ శర్మకు రికార్డ్ ఉంది. అంతేకాదు.. ఇలా ఆల్రెడీ కెప్టెన్‌గా ఉన్న వ్యక్తిని ఓ టీంలో కేవలం ఆటగాడిగా ఉంచి అవమానించిన టీం ఏదైనా ఉందంటే అది ముంబై ఇండియన్సే.