Ambati Rayudu: CSKపై గెలిస్తే కప్ గెలిచేస్తాం అనుకున్నారా?
Ambati Rayudu: ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విమర్శలు గుప్పించారు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. కొన్ని రోజుల క్రితం జరిగిన ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. చెన్నై సూపర్ కింగ్స్‌ని ఓడించిందని.. ఆ తర్వాత కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా అవమానించిందని అంబటి రాయుడు మండిపడ్డారు. ఆరోజున చెన్నైపై గెలిచి ఏదో కప్ సాధించేసినట్లు సెలబ్రేషన్స్ చేసుకున్నారని.. నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆ గర్వం పౌరుషం ఏమయ్యాయంటూ పుండు మీద కారం చల్లినట్లు కామెంట్స్ చేసారు.
“” చెన్నైపై గెలిచేయగానే కప్ సాధించేసామని బెంగళూరు అనుకుంది. అలా కుదరదు కదా. చెన్నైపై ఎలా ఆడారో చివరి మ్యాచ్‌లోనూ అలాగే ఆడితే అప్పుడు గెలిచేవారు. సెలబ్రేషన్స్‌తోనే ట్రోఫీలు వచ్చేస్తాయని అనుకోవడం మూర్ఖత్వం “” అని విమర్శలు గుప్పించారు.