క్రికెట్ సమయంలో సెక్స్.. KKR అసిస్టెంట్ కోచ్‌కి యాంకర్ షాకింగ్ ప్రశ్న
Abhishek Nayar: ఈ ఏడాది IPL ట్రోఫీని కలకత్తా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. KKR గెలుపు వెనక మెంటార్ గౌతమ్ గంభీర్ పాత్ర ఎంతుందో.. అసిస్టెంట్ కోచ్ అయిన అభిషేక్ నాయర్ పాత్ర కూడా అంతే కీలకం. అయితే.. అభిషేక్ నాయర్ ఫేమస్ యూట్యూబర్ అయిన రణ్వీర్ అల్లాబాదియా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. క్రికెట్ మ్యాచెస్ వరుసగా జరుగుతున్న సమయంలో సాంత్వన కోసం ఆటగాళ్లు సెక్స్ చేస్తుంటారా అని రణ్వీర్.. అభిషేక్‌ను అడిగాడు. ఆ ప్రశ్న విని అభిషేక్ షాక్ అయినప్పటికీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
“” అది కచ్చితంగా ఉంటుంది. సెక్స్ లేకుండా ఈ భూమిపై ఏ మనిషి బతకలేడు. అది క్రికెటర్‌ను బట్టి ఉంటుంది. అంతేకానీ కచ్చితంగా సెక్స్‌లో పాల్గొనాల్సిందే అనే రూల్ ఏమీ లేదు. కొందరు క్రికెటర్లకు నచ్చుతుంది.. కొందరికి నచ్చదు “” అని తెలిపారు.