AB de Villiers: ధోనీనే CSK కెప్టెన్‌గా ఉండాలి
AB de Villiers: చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న ఎంఎస్ ధోనీ.. (MS Dhoni) తన బాధ్యతను రుతురాజ్ గైక్వాడ్‌కు (Rituraj Gaikwad) అప్పగించాడు. ఆట మధ్యలో ఓ మెంటార్‌లా గైక్వాడ్‌కు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తున్నాడు. అయితే ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నన్ని రోజులు కెప్టెన్‌గా ఉండి తీరాల్సిందే అని అంటున్నారు ఏబి డివిలియర్స్. ధోనీ నేతృత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు టైటిల్స్ సాధించింది. గైక్వాడ్ నేతృత్వంలో లోపాలు లేవు కానీ ఈసారి మాత్రం చెన్నై ఊహించిన రేంజ్లో ప్రదర్శించలేకపోయింది.
“” నేను గైక్వాడ్ కెప్టెన్సీని తప్పుబట్టడంలేదు. నా వ్యాఖ్యలను వక్రీకరించకండి. చెన్నై సూపర్ కింగ్స్‌లో ధోనీ ఉంటే ఆట తీరు కూడా వేరేలా ఉంటుంది. ధోనీని కెప్టెన్‌గా కాకుండా కేవలం ప్లేయర్‌గా పెట్టుకుని మైదానంలో దిగితే ఏం లాభం లేదు. గతంలో రవీంద్ర జడేజా విషయంలో ఏం జరిగిందో చూసారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. కాబట్టి ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నంత కాలం ఆయనే కెప్టెన్‌గా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం “” అని తెలిపాడు.