“అయినా సరే.. సుందర్ కంటే కుల్దీపే బెటర్”
Aakash Chopra: న్యూజిల్యాండ్‌తో టీమిండియా ఆడిన రెండో టెస్ట్‌లో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సెలెక్షన్ అదుర్స్ అనిపించాడు వాషింగ్టన్ సుందర్. న్యూజిల్యాండ్ లెఫ్ట్ హ్యాండర్లు ఎక్కువగా ఉన్నారని అందుకే సుందర్‌ని తీసుకున్నామని గంభీర్ అన్నాడు. దీనిపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ.. అన్ని అబద్ధాలెందుకు. లోవర్ ఆర్డర్‌కి భయపడి సుందర్‌ని తీసుకున్నామని చెప్పచ్చుగా అని ఎగతాళి చేసాడు. ఇలా తనపై ఎందరు ఎన్ని కామెంట్స్ చేసినా చప్పట్లు కొట్టే విధంగా సుందర్ తన ప్రదర్శనతో అందరి నోళ్లు మూయించాడు.
దీనిపై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా స్పందిస్తూ.. సుందర్ బాగానే ఆడాడు.. అయినా కూడా సుందర్ కంటే కుల్దీప్ యాదవే బెటర్ అనడం వివాదాస్పదంగా మారింది. కుల్దీప్ ఉండి ఉంటే తన విభిన్నమైన బౌలింగ్ స్టైల్‌తో టీమిండియాకు మరింత మంచి గెలుపును అందించేవాడని అన్నాడు.