Vibhuti: విభూదిని ఎలా రాసుకోవాలి?

Hyderabad: విభూది అన‌గానే మ‌న‌కు రెండు ర‌కాలు గుర్తొస్తాయి. ఒక‌టి శిర్డీ సాయి బాబాది. మ‌రొక‌టి శివ‌య్య‌ది. అయితే శిర్డీలో ల‌భించే విభూదిని ధుని నుంచి తీసి ఇస్తారు. కానీ శివాలయంలో ల‌భించే విభూది వేరు. అస‌లు ఈ విభూదిని ఎలా పెట్టుకోవాలి? దాని వ‌ల్ల క‌లిగే లాభాలేంటో తెలుసుకుందాం. (vibhuti)

విభూదిని త్రిపుంద్ర ఆకారంలో నుదుట‌న పెట్టుకోవాలి. అంటే అడ్డంగా మూడు గీత‌లు వ‌చ్చేలా పెట్టుకోవాలి. దీనిని ద‌క్షిణాదిన సైవితే తిల‌కం అంటారు. ఈ మూడు గీతల అర్థ‌మేంటంటే.. మొద‌టి అడ్డ గీత గ‌ర్వాన్ని తొల‌గిస్తుంద‌ని. రెండో గీత అజ్ఞానాన్ని తొల‌గిస్తుంది. ఇక మూడో గీత మ‌నం చేసిన పాపాల‌ను తొల‌గిస్తుంద‌ని అర్థం. విభూదిని ఎడమ చేతిలో వేసుకుని కొద్దిగా నీళ్లు పోసి శివ మంత్రాల‌ను జ‌పిస్తూ నుదుట‌న రాసుకోవాల‌ట‌. అది కూడా కుడి చేతి ఉంగ‌రం వేలితోనే విభూదిని పెట్టుకోవాల‌ని శాస్త్రాలు చెప్తున్నాయి. (vibhuti) మ‌గ‌వారైతే ఈ విభూదిని చేతులు, నుదుటిపైన‌, చెవులు, గొంతు, ఛాతి, భుజాల‌ భాగాల్లో రాసుకోవ‌చ్చు. విభూది రాసుకునేట‌ప్పుడు నేల‌పై ప‌డ‌కుండా చూసుకోవాల‌ట‌.