పూజయ్యాక హారతి ఎందుకిస్తారు?
Harathi: పూజయ్యాక చివర్లో హారతి ఇస్తుంటాం. అసలు హారతి ఎందుకిస్తారు? అసలు హారతి అంటే ఏంటి? వంటి విషయాలను తెలుసుకుందాం.
హారతి అనేది ఆర్తిక అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. మన తెలుగు వారు హారతి అంటారు. ఉత్తర రాష్ట్రాల వారు ఆర్తి అంటారు. ఆర్తిక అంటే అర్థమేంటంటే బాధలు, ఒత్తిడి, ఇబ్బందులు. మనకున్న కష్టాలు, ఇబ్బందుల నుంచి దేవుడు మనల్ని రక్షిస్తాడు అని పూజ చేస్తాం. ఆ తర్వాత దేవుడికి ఎలాంటి కష్టాలు ఇబ్బందులు రాకూడదని మనం హారతి ఇస్తాం. దేవుడి విగ్రహాలకు ఎలాంటి దిష్టి తగలకుండా హారతి ఇస్తుంటారు. హారతి ఇచ్చేటప్పుడు దేవుడి పటాలు, విగ్రహాలకు నాలుగు సార్లు తిప్పాలి. ఆ తర్వాత విగ్రహాల నాభి వద్ద ఒక రెండుసార్లు తిప్పాలి. ఆ తర్వాత దేవుడి విగ్రహానికి ఏడు సార్లు తిప్పాలి.