Spiritual: దేవుడికి కొబ్బరికాయే ఎందుకు కొట్టాలి?
Spiritual: కాయల్లో ఎన్నో వెరైటీలు ఉన్నప్పటికీ మనం దేవుడికి కొబ్బరి కాయే (coconut) ఎందుకు కొడతాం? అని ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక ఉన్న కారణాలేంటో తెలుసుకుందాం.
కొబ్బరి కాయ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇతర కాయలతో పోలిస్తే కొబ్బరిలో ఉండే పోషకాలు మరే కాయలోనూ ఉండవట. ఇలా చెప్తే ఎవ్వరూ నమ్మరు కాబట్టి దేవుడికి కొబ్బరి కాయ అంటే ఇష్టమని మన పూర్వీకులు చెప్తూ వస్తున్నారట. అలాగే మనం పాటించేస్తున్నామట. సైన్స్ ప్రకారం ఇలా ఓ కథ ఉంది.
ఇక ఆధ్యాత్మికంగా కూడా ఓ కథ ఉంది. పూర్వం జంతువులను బలి ఇవ్వకుండా ఆపేందుకు కొబ్బరికాయలు కొట్టేవారట. కొబ్బరి కాయలోని బయటి భాగం మనిషి అహంతో, లోపలి భాగాన్ని శాంతికి చిహ్నంగా పరిగణించేవారట. మనం దేవుడికి కొబ్బరికాయను కొడుతున్నామంటే మనల్ని మనం దేవుడికి అర్పించేసుకుంటున్నామని అర్థం అన్నమాట.