Vastu: తలుపు వెనక దుస్తులు.. లక్ష్మి వెళ్లిపోతుంది..!
Vastu: చాలా మంది ఇళ్లల్లో తలుపుల వెనుక ఉన్న హ్యాండిల్స్‌కి దుస్తులు వేలాడదీస్తుంటారు. ఇలా చేస్తే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తప్పవని వాస్తు శాస్త్రం చెప్తోంది. ఇలా ఎందుకంటే.. ద్వారం పై భాగంలో లక్ష్మి కూర్చుని ఉంటుందట. కాబట్టి తలుపు వెనకాల దుస్తులు వేయడాలు వంటివి చేస్తే లక్ష్మికి ఆగ్రహం వస్తుందని చెప్తారు. దీని వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రావడం.. తరచూ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వంటివి వస్తుంటాయి. దుస్తులు ఎప్పుడూ కూడా నైరుతి దిశలో సర్దుకుంటే మంచిది. విడిచిన దుస్తులను తూర్పు, ఈశాన్య దిశల్లో ఉంచకూడదు. ఇలా చేస్తే ఆరోగ్య, ఆర్థిక సమస్యలు వస్తాయి.