Pearl: ముత్యం ఎవరు ధరించకూడదు?
మన రాశులను బట్టి ప్రత్యేకమైన రాళ్లు, ముత్యాలతో ఉంగరాలు చేయించుకుని పెట్టుకుంటూ ఉంటారు. ఇవి నిపుణులు పరీక్షించాక వేసుకుంటేనే మంచిది. కానీ ఏదో చూడటానికి అందంగా ఉన్నాయి కదా అని వేసేసుకుంటే సమస్యలు వస్తాయి. ముత్యం (pearl) విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఒరిజినల్ ముత్యాలను వేసుకోవాలంటే రాశి నక్షత్రాలను బట్టి మంచివో కాదో చూసి చెప్తారు. అసలు ముత్యం ఎవరు వేసుకోకూడదు?
చంద్రుడి నుంచి ఎలాంటి చెడు ప్రభావం లేకుండా ఈ ముత్యాన్ని ధరిస్తారు. ఎక్కువగా జూన్, నవంబర్ నెలల్లో పుట్టినవారికి ఈ ముత్యాన్ని పెట్టుకోమని సలహా ఇస్తుంటారు. వృషభం, మిథున, సింహ, ధనుస్సు, మకర, కుంభ రాశివారు ముత్యాన్ని అస్సలు ధరించకూడదని జ్యోతిష్యశాస్త్రం చెప్తోంది. ముత్యానికి ఈ రాశుల్లో పుట్టినవారికి నెగిటివిటీ ఎక్కువగా ఉంటుందట.మీ కుండ్లీలో చంద్రుడు 6, 8, 12వ స్థానాల్లో ఉంటే ముత్యాన్ని అస్సలు ధరించకూడదు. ఇవి చెడును గోచరించే స్థానాలు. నీలం, గ్రీన్ ఎమిరాల్డ్, పిల్లి కన్ను రత్నం, గోమేధిక రత్నాలు పెట్టుకున్నవారు కూడా ముత్యానికి దూరంగా ఉంటే మంచిది. (pearl)
ముత్యాన్ని ధరించకూడని వారు ధరిస్తే..?
ముత్యాన్ని ధరించకూడని వారు తెలిసో తెలీకో ధరిస్తే ఎప్పుడూ ఆర్థిక కష్టాలతో సతమతమవుతుంటారు. ఏ పని ప్రారంభించాలనుకున్నా అది సక్సెస్ అవ్వకపోగా నష్టాలను కలిగిస్తుంది. ఎప్పుడూ డిప్రెషన్, కోపంతో మానిసికంగా కుంగిపోతూ ఉంటారు.