Lord Shiva: శివ‌పార్వ‌తుల కూతురి గురించి తెలుసా?

who is lord shiva daughter

Lord Shiva:  శివ‌పార్వ‌తుల‌కు ఇద్ద‌రు కుమారులు ఉన్నార‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఒకరు గ‌ణ‌నాథుడు, మ‌రొక‌రు కుమార స్వామి. అయితే శివ‌పార్వ‌తుల‌కు ఓ కూతురు ఉంద‌న్న సంగ‌తి తెలుసా?

వీరిద్ద‌రికీ ఓ కూతురు కూడా ఉంది. ఆమె పేరు అశోక సుంద‌రి. ఈ అంశం ప‌ద్మ‌పురాణంలో ఉంది. ఓసారి ప‌ర‌మేశ్వ‌రుడు పార్వ‌తి దేవిని నంద‌న‌వ‌నానికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్ద‌రూ క‌లిసి క‌ల్ప‌వృక్షం కింద కూర్చున్నారు. దేవీ.. నీకు ఏం కావాల‌న్నా ఈ వృక్షం ఇస్తుంది అని శివ‌య్య పార్వ‌తిదేవితో అన్నారు. అప్పుడు పార్వతి దేవి ఇలా అంది. స్వామి.. మ‌న కుమారులు ఇద్ద‌రూ పెద్ద‌వారైపోయి ఎవ‌రి ప‌నుల్లో వారున్నారు.

నాకు ఒంట‌రిత‌నంగా ఉంది. నాకు ఒక కుమార్తె కావాలి అని కోరింది. అప్పుడు వెంట‌నే ఎంతో ముద్దుగా ఉండే ఓ కూతురు పార్వ‌తి దేవి ఒడిలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఆ కూతురికి అశోక సుంద‌రి అని పేరు పెట్టి ఎంతో ప్రేమ‌గా పెంచింది. అశోక సుంద‌రి యుక్త వ‌య‌సుకు రాగానే హుండాసురుడు అనే రాక్ష‌సుడు ఎత్తుకుపోతాడు. అప్పుడు న‌హుషుడు ఆ రాక్ష‌సుడి నుంచి అశోక సుంద‌రిని కాపాడి ఆమెను వివాహ‌మాడ‌తాడు.