Astrology: ఏ గ్రహ ప్రభావం వల్ల బట్ట తల సమస్యలు వస్తాయి?
Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి జుట్టు రాలిపోయే సమస్యలు ఉంటాయట. ఇప్పుడున్న కాలంలో జుట్టు ఉంటే చాలురా నాయనా అనుకునేవారు చాలా మంది ఉన్నారు. పాపం చిన్న వయసులోనే బట్ట తలతో పెద్దవారిలా కనిపిస్తూ నరకయాతన అనుభవించేవారూ ఉన్నారు. ఇలాంటివారు తమ ఆత్మ విశ్వాసం కోల్పోకుండా ఉండేందుకు పలు రకాల ట్రీట్మెంట్లు కూడా తీసుకుంటూ ఉంటారు. అసలు జ్యోతిష్యానికి, బట్టతల రావడానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? కొన్ని రాశుల వారికి బట్ట తల కచ్చితంగా వస్తుందో లేదో చెప్పేందుకు కూడా జ్యోతిష్య శాస్త్రం ఉపయోగపడుతుందట. (astrology)
అదెలాగంటే.. ఉదాహరణ మీకు మాటి మాటికీ అనారోగ్య సమస్యలు వస్తుంటే వైద్యులకు చూపించడంతో పాటు ఇంట్లో పెద్దవారు దోషం ఏదైనా ఉందేమో పూజలు, హోమాలు చేయిస్తే కోలుకుంటారు అని చెప్పడం వినే ఉంటారు. మన ఆరోగ్యం కూడా జాతక చక్రంపై ఆధారపడి ఉంటుందన్న మాట. కొన్ని గ్రహాల ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చినట్లు.. జుట్టు రాలిపోవడం, బట్ట తల రావడం వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇంతకీ అవే గ్రహాలో తెలుసుకుందాం.
శుక్రుడు, బుధుడు
శుక్రుడిని అందానికి నిర్వచనంగా చెప్తారు. ఇక బుధుడు మనం ఇతరులతో ఎలా ఉంటామో ఓ మధ్యవర్తిలా వ్యవహరిస్తుంటాడు. సూర్య, చంద్రులతో పాటు ఈ రెండు గ్రహాల ప్రభావం కూడా మనపై ఉంటుంది. ఈ శుక్రుడు, బుధుడు మన తలకట్టు ఎలా ఉంటుందో కూడా ఆదేశిస్తాయి. మన జాతక చక్రంలో బుధుడు, శుక్రుడు వీక్‌గా ఉన్నారంటే జుట్టు రాలే సమస్యలు, బట్ట తల రావడం వంటివి సూచిస్తుంటాయి. (astrology)
శని, బృహస్పతి
శని, బృహస్పతి గ్రహాల ప్రభావం బాలేకపోయినా జుట్టుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ఈ గ్రహాల ప్రభావం ఉన్నవారికి విపరీతమైన కోపం, ఉక్రోశం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
మరి ఈ సమస్యకు పరిహారం ఉందా?
పరిహారాలు ఉన్నాయి. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు, చంద్రుడు కలిసినప్పుడు ఏర్పడే ప్రభావం వల్ల జుట్టు రాలే సమస్యలు వస్తాయి. ఇలాంటి దోషాలు ఉన్నవారు శివుడికి పాలు నైవేద్యంగా పెడుతూ ఉండాలి. వారు తాము రోజూ తీసుకునే ఆహారంలో పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. తలస్నానం చేసేటప్పుడు నిమ్మకాయలో పెరుగు కలిపి తలకు పట్టించి అప్పుడు స్నానం చేయండి. సాయంత్రం వేళల్లో కడిగేసుకోండి. ఎసిడిక్ తత్వం ఎక్కువగా ఉన్న పండ్లు, పానీయాలు ముట్టకండి. ఇలాంటి ఆహార పదార్థాల ప్రభావం శుక్రుడిపై ఎక్కువగా ఉంటుంది.
బుధుడు, సూర్యుడి వల్ల కలిగే ప్రభావం కారణంగానూ జుట్టుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అలాంటివారికి జాతక చక్రంలో బృహస్పతి దృఢంగా ఉంటే పెద్దగా ప్రభావం చూపించదు. ఇందుకోసం రోజూ సూర్యుడిని చూస్తూ సంధ్యావదనం చేస్తూ ఉండాలి. ఇలాంటి వారు మాంసాహారానికి కూడా దూరంగా ఉంటే మంచిది. శుక్రుడి వల్ల కలిగే దోషాల వల్ల కూడా జుట్టు రాలే సమస్యలు విపరీతంగా ఉంటాయి. కాబట్టి శుక్ర గ్రహం ప్రభావం బాగుండాలంటే ఆలయంలో పాలు, బియ్యం వంటివి దానం చేయండి. లేని వారికి కడుపు నిండా భోజనం పెడితే ఎంతో మంచిది.