ధనత్రయోదశి రోజు ఏ సమయంలో కొత్త వస్తువులు కొనాలి?
Dhanatrayodashi: ఈ నెల 29న ధనత్రయోదశి. దీనినే చోటీ దిపావళి అని పిలుస్తారు. అంటే దీపావళి ముందు వచ్చే పండుగ అని అర్థం. ధనత్రయోదశి రోజున బంగారం, వెండి, వాహనాలు ఇలా రకరకాల నూతన వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. అయితే.. ధనత్రయోదశి రోజు నూతన వస్తువులు కొనడం ఎంత మంచిదో సరైన సమయంలో సరైన ముహూర్తంలో కొనడం అంతే ముఖ్యం.
ఈ 29వ రోజున బంగారం, వెండి ఇతర విలువైన సామాగ్రి కొనుగోలు చేసేందుకు మధ్యాహ్నం 2:20 నుంచి రాత్రి 6:57 గంటల మధ్యలో కొనుగోలు చేయచ్చు.
ఇక ఫ్లాట్లు, భూములు, ఇళ్లు వంటివి కొనుగోలు చేస్తుంటే మాత్రం ఉదయం 10:15 నుంచి మధ్యాహ్నం 3:32 మధ్యలో కొనుగోలు చేయొచ్చట.
వాహనాలు, గిన్నెలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయాలంటే మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 7:02 వరకు కొనుగోలు చేయచ్చు.