Spiritual: దీపారాధనకు ఏ నూనె వాడాలి?
Spiritual: చాలా మంది దీపారాధన చేసే సమయంలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నెయ్యి కానీ వాడుతుంటారు. ఈ రెండింటిలో శ్రేష్ఠమైనది ఆవు నెయ్యే. ఆవు నెయ్యితో దీపం పెడితే ఆ దీపానికి వచ్చే కళే వేరు. అయితే ఆవు నెయ్యి అందుబాటులో లేకపోతే నువ్వుల నూనె.. అది కూడా లేకపోతే కొబ్బరి నూనె వాడుకోవచ్చు. ఈ మధ్య మార్కెట్‌లో అన్ని రకాల నూనెలను మిక్స్ చేసి స్పెషల్ దీపారాధన ఆయిల్ అని అమ్మేస్తున్నారు. అలాంటివి అస్సలు తెచ్చుకోకండి.