Vastu: మనీ ప్లాంట్‌ని ఎక్కడ పెడితే మంచిది?
Hyderabad: మనీ ప్లాంట్ (money plant) ఇంట్లో ఉంటే ఎంతో మంచిది అని చెప్తుంటారు. కానీ ఆ మనీ ప్లాంట్‌ని ఏ స్థానంలో పెట్టాలన్నది కూడా చాలా ముఖ్యం అని అంటున్నారు వాస్తు శాస్త్ర (vastu) నిపుణులు. అసలు మనీ ప్లాంట్ ఎక్కడ పెడితే మంచిదో తెలుసుకుందాం.
ఉత్తర ద్వారం
మనీ ప్లాంట్ ఉత్తర ద్వారం దగ్గరుంటే ఎంతో మంచిది. ఇలా ఉంటే కెరీర్‌లో ఉన్నత స్థాయికి వెళ్తారు అని నిపుణులు చెప్తున్నారు.
కింద ఆననివ్వద్దు
మనీ ప్లాంట్ ఎప్పుడూ కుండీలో నుంచి నేలకు తాకకూడదు. మనీ ప్లాంట్ తీగలు ఎప్పుడూ పైకే ఉండాలి.
ఆకులు హృదయాకారంలో ఉండాలి
మనీ ప్లాంట్ కొని తెచ్చుకునేటప్పుడు ఆకులు హృదయాకారంలో నిండుగా ఉండేలా ఉన్నది కొనుక్కోండి. అలా కాకుండా సగం తెగిపోయి, వాడిపోయి ఉన్నవి అస్సలు వద్దు.
వేరొకరితో తాకించకండి
మనీ ప్లాంట్‌ను బయటికి వారు ముట్టుకుని కొమ్మలు కట్ చేసుకుంటాను అంటే అస్సలు ఒప్పుకోకండి. అలా వేరొకరు తాకడం మంచిది కాదు. ఇలా చేస్తే మీరే మీ సంపదను వేరే వారికి ఇచ్చినవారవుతారు.
ఎరుపు రంగు పక్కన వద్దు
మనీ ప్లాంట్ పక్కన ఎర్ర రంగులో ఉన్న ఏ వస్తువుని ఉంచకండి. ముఖ్యంగా మనీ ప్లాంట్ ఉన్నచోట చెత్త, డస్ట్‌బిన్‌లు అస్సలు ఉంచకూడదు.
జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి
మనీ ప్లాంట్ తెచ్చి ఇంట్లో పెట్టుకోగానే సరిపోదు. ఎప్పటికప్పుడు నీట్‌గా మెయింటైన్ చేస్తుండాలి. వాడిపోయిన ఆకుల్ని కత్తిరించడం, రెండు మూడు రోజులకు ఒకసారి నీరు మారుస్తుండడం వంటివి చేయాలి.
రేడియేషన్‌ను పీలుస్తుంది
మనీ ప్లాంట్ రేడియేషన్‌ను పీల్చుకుంటుంది అంటారు. మీ ఇంట్లో వైఫై లేదా ఎక్కువ రేడియేషన్ ఇచ్చే గ్యాడ్జెట్ల పక్కన పెట్టి ఉంచండి. దీని వల్ల మీపై ఎక్కువ రేడియేషన్ ప్రభావం ఉండదు.
నీలి రంగు వేసులు బెస్ట్
ఆకు పచ్చ, నీలి రంగులు సిరిసంపదలను చిహ్నంగా భావిస్తారు. మనీ ప్లాంట్‌ని పెట్టే కుండీలు నీలి రంగులో ఉండేలా చూసుకోండి.