Buddha: బుద్ధుడి విగ్రహం ఎక్కడ పెట్టాలి?
ఇంట్లో చాలా మంది బుద్ధుడి (buddha) విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు. హాల్‌లో, బెడ్ రూంలో స్టడీ రూంలో ఇలా అనేక చోట్ల పెట్టుకుంటూ ఉంటారు. కానీ అసలు వాస్తు ప్రకారం బుద్ధుడి విగ్రహం ఎక్కడుంటే మంచిది?
*ప్రవేశ ద్వారం దగ్గర బుద్ధుడి విగ్రహం ఉంటే ఎంతో మంచిది. కాకపోతే నేలపై కాకుండా ఏదైనా పీట లేదా స్టూల్ వేసి దానిపై పెట్టండి. ప్రవేశ ద్వారం దగ్గర స్వాగతిస్తున్నట్లుగా ఉన్న బుద్ధుడి విగ్రహం నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది.
*మీ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చునే గదిలో పెట్టుకున్నా కూడా మంచిదే. ఒకవేళ బుద్ధుడి విగ్రహం పెట్టడానికి ప్లేస్ లేకపోతే పెయింటింగ్ అయినా పెట్టుకోవచ్చు. (buddha)
*లివింగ్ రూంలో బుద్ధుడిని పెట్టుకోవాలంటే నిద్రిస్తున్నట్లుగా ఉన్న విగ్రహాన్ని తెచ్చి పెట్టుకోండి. ఎప్పుడు లివింగ్ రూంలోకి వచ్చినా ఆయన విగ్రహాన్ని చూడగానే ప్రశాంతంగా ఉంటుంది.
*స్టడీ డెస్క్‌పైన పెట్టుకుంటే ఇంకా మంచిది. వర్క్ డెస్క్‌పై బుద్ధుడి బొమ్మ ఉంటే డీలింగ్స్ బాగా జరుగుతాయట. అందుకే షాపుల్లో రిసెప్షన్ దగ్గర ఎక్కువగా ఆయన బొమ్మలు ఉంటాయి.
*మీ ఇంట్లో గార్డెన్ ఉంటే అక్కడ ఒక బుద్ధుడి విగ్రహాన్ని పెట్టించుకోండి. మీకెప్పుడు అలసటగా అనిపించాన అలా గార్డెన్ లోకి వెళ్లి కాసేపు బుద్ధుడిని చూస్తూ ఉంటే చాలు. ఎంత హాయిగా ఉంటుందో మీకే తెలిసిపోతుంది. (buddha)
*ఒకవేళ ప్రేయర్ రూం లాంటిది ఏమైనా ఉంటే అక్కడ ఈ బుద్ధుడి విగ్రహాన్ని మీ కంటి చూపు హైట్‌లో పెట్టుకోండి. కానీ బుద్ధుడి విగ్రహం పక్కన మరే విగ్రహాలు పెట్టకూడదు అని మాత్రం మర్చిపోకండి.
*మరో ముఖ్యమైన విషయం మనం పూజా గదిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో.. బుద్ధుడి విగ్రహం ఉన్న ప్రదేశాన్ని కూడా అంతే క్లీన్‌గా పెట్టుకోవాలి. (buddha)