Spiritual: పూజ మధ్యలో ఆవలింత వస్తే..?
Hyderabad: ఉదయాన్నే ఇల్లంతా శుభ్రం చేసుకుని సూర్యోదయానికి ముందే పూజ (puja) చేసేస్తుంటారు కొందరు. అయితే పూజ చేస్తున్నప్పుడు ఆవలింతలు వస్తుంటాయి. చాలా మంది అది సర్వసాధారణమే కదా అనుకుంటారు. కానీ పూజ చేసే సమయంలో ఆవలింత అనేది రాకూడదట. (spiritual)
ప్రతి మానవుడి కుడి చెవిలో గంగ అంశ ఉంటుందట. అందుకే ఏదైనా పూజ (puja) చేసేటప్పుడు ఆవలింత వచ్చినా శరీరంలోని ఒక్క ముక్కు భాగం నుంచి తప్ప మిగతా రంధ్రాల నుంచి వాయువు బయటికి వెళితే మళ్లీ స్నానం చేస్తే తప్ప ఆ పూజ చేయకూడదట. కానీ చాలా మందికి ఈ విషయం తెలీదు. పూజ చేస్తూ ఆవలింతలు వస్తున్నా అలాగే కానిచ్చేస్తారు. అలాగని పూజ చేస్తున్నంత సేపు ఆవలింతలు వస్తుంటే ఎన్ని సార్లు అలా స్నానాలు చేస్తాం చెప్పండి? అందుకే దీనికి ఒక పరిష్కారం ఉంది. ఆవలింత వచ్చినప్పుడల్లా మీ కుడి చేతిని కుడి చెవిపై పెట్టుకోండి. అలా చేస్తే సాక్షాత్తు గంగలో స్నానం చేసినట్లేనని పురాణాలు చెప్తున్నాయి. (spiritual)