Spiritual: మీపై ప‌డి ఏడుస్తున్నారా… ఇలా చేయండి

what to do if someone is jealous of you

Spiritual: మ‌నం బాగుప‌డినా.. ఏద‌న్నా ఉద్యోగం వ‌చ్చినా, కారు కొన్నా, ఇల్లు కొన్నా మ‌న‌పై ప‌డి ఏడ్చేవారు చాలా మందే ఉంటారు. మ‌న ముందేమో సంతోషంగా ఉన్న‌ట్లు న‌టిస్తుంటారు. మ‌న వెన‌క వాడు అది కొనేసాడు.. ఇది కొనేసాడు అంటూ ఏడుస్తుంటారు. ఇలాంటి వారు ముఖ్యంగా మ‌న బంధువుల ఇళ్ల‌ల్లోనే ఉంటారు. ఎవ‌రైన‌ప్ప‌టికీ.. ఇత‌రుల ఏడుపులు మ‌న‌కు త‌గ‌ల‌కూడ‌దంటే ఈ చిట్కా పాటించండి.

పూర్వం దిష్టి తీసేందుకు క‌ళ్లుప్పుని వాడేవారు. ఇప్పుడు ఇత‌రుల ఏడుపుల వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌కుండా ఉండాల‌న్నా కూడా ఈ క‌ళ్లుప్పే సాయ‌ప‌డుతుంది. ఒక ట‌బ్‌లో గోరువెచ్చ‌ని నీళ్లు పోసుకోండి. అందులో మూడు పిడికిళ్ల క‌ళ్లుప్పును వేయండి. ఆ త‌ర్వాత మీ కాళ్ల‌ను ఆ ట‌బ్‌లో పెట్టండి. నీళ్లు మోకాళ్ల‌కు కాస్త కింది వ‌ర‌కు అంటాలి. కానీ జాగ్ర‌త్త‌.. వేడి నీళ్లు అంటే మ‌రీ తోలు ఊడిపోయేలా పెట్ట‌కండి. మీరు భ‌రించ‌గ‌లిగేంత వేడి ఉంటే చాలు. అలా ఒక అర‌గంట పాటు పెట్టుకుని చూడండి.

అర‌గంట త‌ర్వాత ఏదో తెలీని శ‌క్తి వ‌చ్చిన‌ట్లు ఉంటుంది. ఈ చిట్కాను చిన్న పిల్ల‌ల‌పై పాటించ‌కండి. వారికి కేవ‌లం క‌ళ్లుప్పుతో దిష్టి తీసేస్తే చాలు. ఈ వేడి నీళ్లు, క‌ళ్లుప్పు రెమిడీ కేవ‌లం ఇత‌రుల ఏడుపులు మ‌న‌కు త‌గ‌ల‌కుండా ఉండేందుకు మాత్ర‌మే.