Resume: మీ రెస్యూమ్‌లో ఈ పాయింట్లు రాస్తున్నారా?
Hyderabad: మంచి ఉద్యోగం సాధించాలంటే.. దానికి కావాల్సింది అంతకంటే మంచి రెస్యూమ్ (resume). ఈ రెస్యూమ్ అనేది ఓ మినీ ఇంటర్వ్యూ లాంటిది. రెస్యూమ్‌లో మనం రాసే పాయింట్లను బట్టే కంపెనీలు మనకు కాల్స్ చేసి ఇంటర్వ్యూలు తీసుకుంటూ ఉంటాయి. అదే రెస్యూమ్ (resume) బాగాలేదనుకోండి.. ఫస్ట్‌లోనే ఇంప్రెషన్ పోతుంది. మరి రెస్యూమ్‌లో పెట్టాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దాం.
మీరు రెస్యూమ్‌లో (resume) ఏ కంపెనీల్లో పనిచేసారు, ఎలాంటి రోల్స్‌లో పనిచేసారు, మీ బాధ్యతలు ఏంటి అనేవి రాస్తారు కదా. ఇలాంటివి వివరిస్తున్నప్పుడు ఇవి ఎచీవ్ (achieve) చేసాను అనే పాయింట్ రాయడం మర్చిపోకండి. ఆ ఎచీవ్ అనే పదం సక్సెస్ అయ్యాం అని గుర్తుచేస్తుంది. మీరు చేరబోయే కొత్త కంపెనీలో కూడా అంతే సక్సెస్ అవుతారు అని తెలుస్తుంది. మీలో ఉన్న క్రియేటివిటీ, ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్‌ను హైలైట్ చేస్తూ మీరు ఎంత ఇన్నోవేటివో వివరించడండి. ఈ ఇన్నోవేటివ్ (innovative) అనే పదం కచ్చితంగా వాడి చూడండి. ఫలానా ప్రాజెక్ట్‌లో పనిచేసా, లేదా ఓ టీంని లీడ్ చేసా అని రాసేటప్పుడు ఎలా టీంకి హెల్ప్ అయ్యారో క్లియర్‌గా వివరించండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూలు చేసేటప్పుడు అడిగిన ప్రశ్నలే అడుగుతారు కానీ అవతలి వ్యక్తి చెప్పేది మాత్రం అస్సలు పట్టించుకోరు. అందుకే మీరు కంపెనీకి ఏం చెప్పాలనుకుంటున్నారో రెస్యూమేలో పెట్టేయండి.
ఇంప్లిమెంటెడ్ (implemented) అనే పదాన్ని వాడి మీ ఐడియాలతో ప్రాజెక్ట్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లారో కూడా వివరించండి. మీ ప్లాన్లు, స్ట్రాటెజీలు ఏంటో కూడా ఇన్క్లూడ్ చేయండి. మీ ఆర్గనైజేషనల్ స్కిల్స్ గురించి రాసేటప్పుడు స్ట్రీమ్లైన్డ్ (streamlined) అనే పదాన్ని తప్పకుండా వాడండి. ఈ పదం వాడితే మీరు ప్రాసెస్‌ను ఎలా ఈజీ చేయగలుగుతారో కంపెనీలకు క్లియర్‌గా అర్థం అవుతుంది. చివరిగా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏదో సాదా సీదా రెస్యూమ్‌ను పోర్టల్స్‌లో పెట్టేసి ఇంటర్వ్యూల్లో మన తడాఖా చూపిద్దాంలే అనుకుంటే అది పొరపాటే. ఇంటర్వ్యూ చేసేటప్పుడు మిమ్మల్ని అడిగే ప్రశ్నలు మీరు రెస్యూమ్‌లో రాసిన వాటి గురించే ఉంటాయి. ఆ తర్వాతే టెక్నికల్ క్వశ్చన్స్ వేస్తారు. ఆల్ ది బెస్ట్.