Sashtanga Namaskaram: అంటే ఏంటి? ఎవరు చేయాలి?
Hyderabad: గుడికి వెళ్లినప్పుడో , లేదా ఇంట్లో పూజ చేసుకున్నాకో సాష్టాంగ నమస్కారం (sashtanga namaskaram) చేస్తుంటారు. అయితే ఎక్కువగా మగవాళ్లే సాష్టాంగ్ నమస్కారం చేయడాన్ని చూస్తుంటాం. అసలు సాష్టాంగ నమస్కారం అంటే ఏంటి? ఎవరు చేయాలి? ఎవరు చేయకూడదు? ఈ విషయాలు తెలుసుకుందాం.
సాష్టాంగ నమస్కారం అంటే ఏంటి?
మన శరీరంలోని అన్ని అంగాలను నేలకు తాకించి నమస్కారం చేస్తాం కాబట్టి దానిని సాష్టాంగ నమస్కారం అంటారు. దీనిని దండకార, ఉద్దండ నమస్కారం అని కూడా అంటారు. దండ అంటే కర్ర. ఓ కర్రను నేలపై పడేస్తే అది ఎలా పడుతుందో.. మనిషి కూడా ఆ కర్రలాగే నేలపై పడి నమస్కరిస్తాడు కాబట్టి ఉద్దండ నమస్కార అంటారు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే.. ఓ మనిషి కర్రలాగా అలా కిందపడిపోయినట్లు నమస్కరిస్తున్నాడు అంటే దానికి అర్థం నిస్సహాయంగా ఉన్నాడని. దేవా.. నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను. నన్ను ఆదరించాల్సింది కాపాడాల్సింది నువ్వే అని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు అర్థం. సాష్టాంగ నమస్కారం చేస్తున్నప్పుడు తలను కూడా నేలకు ఆనిస్తాం. ఒకరి వల్ల మన తల కిందకు దించాము అంటే దానికి అర్థం.. సిగ్గుతో తలవంచుకున్నట్లు. అదే మనంతట మనమే తలను దించి నేలకు తాకించాం అంటే అది భక్తి అని అర్థం. (sashtanga namaskaram)
ఎలా చేయాలి?
అసలు సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలంటే.. ముందు మోకాళ్లపై కూర్చుని మెల్లినా శరీరంలోని అన్ని అంగాలను నేలకు తాకిస్తూ చేతులు ముందు చాచి నమస్కరించాలి.
ఎవరు చేయాలి?
ఈ సాష్టాంగ నమస్కారాన్ని కేవలం పురుషులు మాత్రమే చేయాలి. మహిళలు చేయకూడదు. ఎందుకంటే.. మహిళల వక్షోజాలు, గర్భం ఎప్పుడూ నేలకు తాకించకూడదు. అప్పులు మహిళలు సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలంటే.. కేవలం మోకాళ్లపై మోకరిల్లి నేలకు నమస్కరించాలి. మహిళలు చేసే ఈ నమస్కారాన్ని పంచాంగ నమస్కారం అంటారు. (sashtanga namaskaram)