Spiritual: అర‌ చెయ్యి దుర‌ద పెడితే దేనికి సంకేతం.. లాభ‌మా న‌ష్ట‌మా?

Spiritual: అర చేతిలో దుర‌ద‌పెడుతోందంటే పెద్ద‌లు ఏవేవో విచిత్ర‌మైన మాట‌లు చెప్తూ ఉంటారు. దురద పెడుతోందంటే దాని అర్థం ఆర్థికంగా లాభ‌ప‌డ‌బోతున్నార‌ని చెప్తుంటారు. అస‌లు అర‌చేతికి దుర‌ద పెడితే మంచిదా? నిజంగానే డ‌బ్బులు వ‌స్తాయా?

*పురుషుల‌కు కుడి అర చెయ్యి దుర‌ద పెడుతోందంటే.. అది మంచి శ‌కునం అనుకోవాల‌ట‌. దీని అర్థం ఆర్థికంగా బాగుంటుంద‌ని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది.

*మ‌గ‌వారి ఎడ‌మ అర చేతికి దుర‌ద పెడితే.. అది అశుభం. వ‌చ్చిన డ‌బ్బుని ఇష్టారాజ్యంగా ఖ‌ర్చు చేసేస్తార‌ని అర్థం. డ‌బ్బు చేతిలో అస్స‌లు నిల‌వ‌కుండాపోతుంద‌ట‌.

*అదే ఆడ‌వారికి ఎడ‌మ అర‌చేతిలో దుర‌ద పెడితే మంచి శకునంగా భావిస్తారు. త్వ‌ర‌లో విజ‌య‌వంతం కాబోతున్నార‌ని సూచిస్తుంద‌ట‌.

*అదే కుడి అర చేతిలో దుర‌ద‌పెడితే త్వ‌ర‌లో సంపాదించిన‌దంతా కోల్పోతార‌ని అర్థ‌మ‌ట‌. దుర‌ద పెడితే గోక‌కుండా అలా వ‌దిలేయ‌డ‌మే ఉత్త‌మం.