Sparrow: ఇంట్లోకి పిచుకలు.. దేనికి సంకేతం?
Sparrow: ఉదయం లేవగానే ఇంటి బయట పిచుకల శబ్దం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడంటే వాటి జాతి తగ్గిపోతోంది కానీ ఒకప్పుడు కాకుల కంటే వీటి జనాభానే ఎక్కువగా ఉండేది. ఈ సంగతి పక్కన పెడితే.. అసలు ఇంటి బయట కానీ ఇంట్లో కానీ పిచుకలు వస్తే మంచిదేనా? పదే పదే ఇంట్లోకి పిచుకలు రావడం అనేది దేనికి సంకేతం? ఏ పక్షులు ఇంట్లోకి వస్తే శుభ ఫలితాలు ఉంటాయి? వంటి అంశాల గురించి మన శాస్త్రంలో వివరించారు.
మన ఇంట్లోకి పదే పదే పిచుకలు వస్తున్నాయంటే శుభ, అశుభ సూచకాలు ఉన్నాయి. వీటి గురించి తెలుసుకునే ముందు పిచుక శాసనం అనే కథ గురించి తెలుసుకోవాలి. ఒక బుల్లి పిట్ట సముద్రపు ఒడ్డున రెండు గుడ్లను పెట్టింది. ఆ రెండు గుడ్లను చూసుకుని మురిసిపోయింది. ఆ రెండు గుడ్లు ఎప్పుడు పిల్లలుగా మారతాయా అని ఎదురుచూసింది. అయితే.. ఒకసారి ఆహారం కోసం వెళ్లి వచ్చే సరికి గుడ్లు కనిపించలేదు. ఆ గుడ్లను అలలే లాక్కునిపోయాయి అని అర్థమయ్యింది. వాటిని ఎలాగైనా సరే తీసుకుని రావాలని నిర్ణయించుకుని ఆ తల్లి పిచుక. ఓ సముద్రుడా నా గుడ్లను ఒడ్డుకు చేర్చు అని వేడుకుంది. సముద్రుడు చలించకపోవడంతో పిట్ట కోపంగా ఈ నీళ్లన్నీ తోడేస్తా అని శపథం చేసింది. (Sparrow)
వెంటనే పిట్ట దాని ముక్కుతో కొంచెం కొంచెంగా నీళ్లు తీయడం మొదలుపెట్టింది. అది చూసి సముద్రుడు ఇతర జంతువులు పకపకా నవ్వుకున్నాయి. అయినా పిచ్చుక మాత్రం తన పని ఆపలేదు. ఈ విషయం గరుత్మంతుడికి తెలుస్తుంది. ఈ చిన్న పిచుక ధైర్యానికి గరుత్మంతుడు ఆశ్చర్యపోయాడు. తనవంతు సాయం చేయాలనుకున్నాడు. పిల్లల కోసం సముద్రుడితో తలపడుతున్న నీ ధైర్యానికి మెచ్చాను. నేను నీకు సాయం చేయాలని అనుకుంటున్నాను అని చెప్పాడు. అతని మాటలకు పిచుక సంతోషించింది. గరుత్మంతుడు భీకర స్వరంతో మిత్రమా.. గుడ్లను తిరిగి ఒడ్డుకు చేర్చు. లేకుండా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని బెదిరించాడు. దాంతో సముద్రుడు భయపడి గరుత్మంతుడి వల్ల విష్ణువు తనతో యుద్ధానికి వస్తే తన పని అయిపోయినట్లే అని భయపడతాడు.
అలా దాచిన గుడ్లను మెల్లిగా ఒడ్డుకు చేర్చి పిచుకను క్షమాపణ కోరాడు. తన గుడ్లను చూసి ఆ పిచుక ఆనందంతో ఎగిసిపోయింది. అయితే.. నిజమైన పిచుకలు పేసరిడి కుటుంబానికి చెందిన చిన్న పక్షులు. కొండ పిచుకలు పట్టణాల్లో ఉంటూ ఏదో ఒకటి తినేస్తుంటాయి. పిచుక జాతి అంతరించపోతుంది. అంతరించిపోతున్న పచ్చదనం, రసాయనాలతో పండ్లు, ఆహార ఉత్పత్తి పిచుకలు అంతరించిపోవడానికి కారణాలు.
ఇంట్లోకి పిచుకలు
ఇంట్లోకి పిచుకలు వస్తున్నట్లైతే.. కచ్చితంగా దానికి ఒక అర్థం ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పక్షులు ఇంట్లోకి రావడం వల్ల శుభాలు ఉన్నాయి అదే విధంగా అశుభాలూ ఉన్నాయి. పిచుకలు ఇంట్లోకి పదే పదే వస్తుంటే దాని అర్థం మీరు త్వరలో రాజభోగాన్ని అనుభవించబోతున్నారని..! పూర్వీకులు ఎక్కువ శాతం వరకు పక్షులను పెంచుకునేవారు. వాటి కోసం గింజలను నీళ్లను పెట్టేవారు. ఇంట్లోకి పిచుకలు ప్రవేశించడం వల్ల మంచి జరుగుతుందని వాస్తు శాస్త్రం నిపుణులు చెప్తున్నారు.