Spiritual: క‌ల‌లో డ‌బ్బు క‌నిపిస్తోందా.. దాని అర్థ‌మేంటి?

మ‌న‌కు రాత్రిళ్లు ఎన్నో ర‌కాల క‌ల‌లు (dreams) క‌నిపిస్తుంటాయి. కొంద‌రికి ప‌దే ప‌దే డ‌బ్బులు క‌నిపిస్తుంటాయి. దీని అర్థ‌మేంటి? క‌ల‌లో డ‌బ్బు క‌నిపిస్తే మంచి శ‌కున‌మేనా? (spiritual)

మ‌న‌కు రాత్రిళ్లు క‌ల‌లు ఎప్పుడొస్తాయంటే.. మ‌న క‌ళ్లు ర్యాపిడ్ మూవ్‌మెంట్‌లో ఉన్న‌ప్పుడు. అంటే మ‌న క‌ళ్లు మూసుకని ఉన్న‌ప్పుడే క‌దులుతూ ఉంటాయి. అదే స‌మ‌యంలో మ‌న‌కు క‌ల‌లు వ‌స్తాయి. ఇలాంటి స‌మ‌యంలోనే మ‌న మైండ్ విశ్వానికి క‌నెక్ట్ అయివుంటుంద‌ట‌. అయితే క‌ల‌లో డ‌బ్బు క‌నిపించ‌డం అనేది కూడా ఆ వ్య‌క్తి జ‌న్మ న‌క్ష‌త్రం, రాశి, తిథిని బ‌ట్టి వివిధ కార‌ణాల వ‌ల్ల క‌ల‌లో డ‌బ్బు క‌నిపిస్తుంటుంద‌ట‌. క‌ల‌లో డ‌బ్బు క‌నిపిస్తే చాలా మంచిది. వారి భ‌విష్య‌త్తు బాగుంటుంద‌ని అర్థం. (spiritual)

ఒక‌వేళ క‌ల‌లో ఆభ‌ర‌ణాలు, నిధులు, కొత్త క‌రెన్సీ నోట్లు క‌నిపిస్తే త్వ‌ర‌లో వారికి ధ‌న‌ప్రాప్తి క‌ల‌గ‌బోతోంద‌ని అర్థం. అదే చిరిగిపోయి ద‌మ్ముప‌ట్టిపోయిన డ‌బ్బు క‌ల‌లో క‌నిపిస్తే త్వ‌ర‌లో అప్పుల బాధ రాబోతోంద‌ని అర్థ‌మట‌. క‌ల‌లో మీరు డ‌బ్బు లెక్క‌పెడుతున్న‌ట్లు కానీ.. డ‌బ్బుని ప‌ట్టుకున్న‌ట్లు కానీ వ‌స్తే ఇంకా మంచి శ‌కునం. దీని అర్థం.. మీరు ఆర్థిక విష‌యాల్లో చాలా కాన్ఫిడెన్ట్‌తో ఉన్నార‌ని, మ‌నీ మేనేజ్‌మెంట్ స్కిల్స్ బాగున్నాయ‌ని అర్థం. ఒకవేళ క‌ల‌లో మీకు ఎవ‌రైనా డ‌బ్బు ఇస్తున్న‌ట్లు క‌నిపించింద‌నుకోండి మీకు విజ‌యం వైపు అడుగులు వేస్తున్నార‌ని అర్థం. మీకు ధ‌నప్రాప్తి క‌లిగే అవ‌కాశాలు రాబోతున్నాయ‌ని ఆ క‌ల సూచిస్తోంది. (spiritual)