ఎలుక కనిపిస్తే ఏమవుతుంది.. శుభమా అశుభమా?
Spiritual: ఎలుకలు ఇళ్లలో కనిపిస్తూనే ఉంటాయి. మన జీవితంలో జరుగుతున్న పరిణామాలను బట్టి మనకు ఎలుక (rat) కనిపిస్తే దాని వెనుక ఓ ఆధ్యాత్మిక అర్థం ఉందని అంటున్నారు నిపుణులు. అసలు మనకు ఎలుక కనిపిస్తే ఏమవుతుంది? కలలో కనిపించినా నిజంగా కనిపించినా శుభం జరుగుతుందా లేక అశుభమా? ఎలుకను మూషికం అని కూడా పిలుస్తుంటాం. మూషికం వినాయకుడి వాహనం. అలాగని అన్ని ఎలుకలు ఆయన వాహనాలేనా?
*మీ ఇంట్లో అసలు ఎలుకల బెడదే లేనప్పుడు కూడా ఉన్నట్టుండి ఏదో ఎలుక కనిపిస్తే ఏదో ప్రమాదం పొంచి ఉందని అర్థం.
*ఎలుకలు వేగంగా పాకుతుంటాయి. మీకు ఉన్నట్టుండి ఓ ఎలుక వేగంగా పాకుతున్నట్లు కనిపిస్తే మీరు ఏదో ముఖ్యమైన పనిని త్వరగా పూర్తి చేయకుండా వాయిదా వేస్తున్నారని అర్థం.
*మన హిందూ సంప్రదాయంలో ఎలుకలను వినాయకుడి వాహనాలుగా.. ఏనుగులను గణనాథులుగా భావిస్తాం కాబట్టి.. మీకు ఎలుక కనిపించినట్లైతే దానిని తరిమేసినా ఫర్వాలేదు కానీ గాయపరచడం, చంపడం వంటివి చేయకండి.
*ఎలుకలు అవి ఉన్న పరిసరాలను బట్టి మార్పు చెందుతూ ఉంటాయి. అలాగే జీవితంలో కూడా మనకు ఉన్నట్టుండి ఏ రకమైన మార్పు వచ్చినా దానికి తగ్గట్టు మనల్ని మనం మలుచుకోవాలి.
*ఎలుకలు విలువైన వస్తువులను కూడా నమిలి, కొరికి పాడుచేస్తుంటాయి. దీని అర్థం ఏదో విలువైన వస్తువు కోల్పోతున్నట్లు కానీ పొందుతున్నట్లు కానీ భావించాలట.