అందరూ బాగుండాలి.. ఇది ఒక దివ్య మంత్రం !
Spiritual: అందరూ బాగుండాలి.. అందులో మనం ఉండాలి అనే మాటను సినిమాల్లో డైలాగ్గా వినే ఉంటాం. అందరూ బాగుండాలి (సర్వేజనా సుఖినో భవంతు) అనేది కేవలం ఒక వాక్యం కాదు..ఇది ఒక దివ్య మంత్రం ! ఇతర మంత్రాలకంటే ఇదే గొప్పగా పనిచేస్తుంది! దీనిని ప్రయోగించి చూసినవారికి దాని ఫలితాలు పూర్తిగా తెలుస్తాయి.
అందరూ బాగుండాలని అనుకోవల్సిన అగత్యం ఏమిటి? అంటూ ఎదురుప్రశ్న వేసే వారున్నారు.
ఇతరుల బాగు కోరితే ఏం వస్తుంది? అని ప్రశ్నించేవారూ లేకపోలేదు.
అందరూ బాగుండాలని అనుకోవడం వెనుక ఓ రహస్యం ఉంది
“సర్వేజనా స్సుఖినో భవంతు!” అనేది పెద్దల మాట!
ఇతరులు బాగుండాలని కోరుకునే వాడు…. తానూ బాగుంటాడు !!
ప్రతి రోజూ… తనకు సంబంధంలేని మనిషి క్షేమం కోరి హృదయ పూర్వకంగా ప్రార్థన చేసే వ్యక్తికి అదే ఆరోగ్యం, ఆనందం!
ఈ ఆరోగ్యం ఆనందం కోసం అతడు ఎక్కడికీ వెళ్ళనక్కరలేదు. అలా దైవ ప్రార్థన చేస్తున్నపుడే శరీరంలో మార్పులు కలుగుతాయి. మనసులో చక్కటి భావప్రకటనలు ఏర్పడి ధ్యానంగా మారి రోగాల్ని దూరం చేస్తాయి.
లోకం క్షేమం కోరుకునేవారి బాగును భగవంతుడే చూసుకుంటాడు.
నలుగురు ఇళ్ళు కట్టుకోవడానికి సహాయపడిన వ్యక్తిని చెట్టు కింద ఎవరు ఉండనిస్తారు?
నిజాయితీగా నిస్వారంగా ఉండేవారు, నలుగురి క్షేమమూ కోరేవారే ఈలోకానికి కావాలి. వారందరి ఉమ్మడి రూపమే దివ్యశక్తి ! దాన్ని ఏ దేవుడి పేరుతోనైనా పిలుచుకోవచ్చు!
కానీ ఈరోజుల్లో ఈ మంచితనం పనికిరాదు. అందుకే సాయం చేయకపోయినా ఫర్వాలేదు ఎదుటివారికి నష్టం కలిగించే పనులు మాత్రం అస్సలు చేయకండి. (spiritual)