Vastu: సిరి సంప‌ద‌లు క‌ల‌గాలంటే..!

వాస్తు విష‌యంలో చాలా మంది ఎంతో స్ట్రిక్ట్‌గా ఉంటారు. అన్నీ వాస్తుకు (vastu) త‌గ్గ‌ట్టు ఉన్నాయో లేదో చూసుకుంటారు. అయితే కొన్ని వాస్తు టిప్స్‌ని పాటిస్తే అపార‌మైన ధ‌న‌లాభం క‌లుగుతుంద‌ట‌. క‌ష్ట‌ప‌డందే ఏదీ రాదు. అది అంద‌రికీ తెలిసిందే. వాస్తు టిప్స్‌ని ఫాలో అవుతున్నాం కదా ఇక ఇంట్లో కూర్చుంటే డ‌బ్బు దానంతట అదే వ‌స్తుంది అనుకుంటే మూర్ఖ‌త్వం అవుతుంది. వాస్తు అనేది మ‌నం ప‌డే క‌ష్టానికి ప్ర‌తిఫ‌లం చేకూర్చడానికే త‌ప్ప అది డ‌బ్బు ఉచితంగా ఇచ్చే మాయాజాలం ఏమీ కాదన్న విష‌యాన్ని గుర్తుంచుకోవాలి.

*ఇంట్లో ఒక కుబేర యంత్రాన్ని తెచ్చి ఈశాన్య మూలాన పెట్టుకోండి. అక్క‌డ భారీ వ‌స్తువులు, ఫ‌ర్నీచ‌ర్‌, టాయ్‌లెట్ వంటివి లేకుండా ఉంటేనే పెట్టుకోవాలి.

*ఇల్లు ఎప్పుడూ చింద‌ర‌వంద‌ర‌గా ఉంటే ల‌క్ష్మీ దేవి ఉండ‌దు. ఎప్పుడూ శుభ్రంగా క‌ళ‌క‌ళ‌లాడుతూ ఉండాలి. (vastu)

*మీ ఇంట్లోని లాక‌ర్ ఎప్పుడూ నైరుతి దిశ‌గా ఉండాలి. లాక‌ర్ త‌లుపు తీసే దిశ ప‌డ‌మ‌ర‌, ద‌క్షిణం వైపు ఉండ‌కూడ‌దు.

*మీ ఇంటి ప్ర‌ధాన ద్వారం ఎంత శుభ్రంగా, క‌ళ‌క‌ళ‌లాడుతుంటే అంత మంచిది. సాక్షాత్తు ల‌క్ష్మీదేవే ముచ్చ‌ట‌ప‌డి ఇంట్లోకి అడుగుపెడుతుంద‌ట‌. ప్ర‌ధాన ద్వారంపై ఎలాంటి ప‌గుళ్లు, మ‌ర‌క‌లు, మురికి లేకుండా చూసుకోండి. ద్వారం ముందు మొక్క‌లు, గంట‌లు లాంటివి పెట్టుకుంటే ఇంకా మంచిది. (vastu)

*ఇంటి పైన ఏర్పాటుచేసుకునే వాట‌ర్ ట్యాంక్స్ ఎప్పుడూ కూడా ఈశాన్య‌, ఆగ్నేయం వైపు ఉండ‌కూడ‌దు. ఇలా ఉంటే ఎప్పుడూ ఇంట్లో ఆర్థిక‌, అనారోగ్య స‌మ‌స్య‌లు ఉంటాయి.

*ఇంట్లో ఎప్పుడూ కూడా వాట‌ర్ లీక్ అవుతూ ఉండ‌కూడ‌దు. నీరు ఎక్క‌డ వృధా అవుతుందో అక్క‌డ ల‌క్ష్మి ఉండ‌దు.

*ఇంట్లో ఏడు గుర్రాల పెయింటింగ్‌ను లివింగ్ రూంలో తూర్పు వైపు పెట్టుకుంటే ఇంకా మంచిది. (vastu)