Vastu Tips: గులాబీలు ఇచ్చే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
Vastu Tips: వ్యాలెంటైన్ వీక్ (valentine’s week) మొదలైపోయింది. ఈరోజు గులాబీ దినోత్సవం. అంటే రోజ్ డే (rose day). ప్రేమికులు ఒకరికొకరు గులాబీలను ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. అయితే ఈ విషయంలో కూడా వాస్తు శాస్త్రం అనేది పనిచేస్తుందట. వాస్తు శాస్త్రం ప్రకారం అందరికీ గులాబీలు ఇస్తే వర్కవుట్ కాదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఎలాంటి గులాబీలు ఇవ్వాలో తెలుసుకుందాం.
ఎరుపు లేదా పింక్
మీరు మీ పార్ట్‌నర్‌కు గులాబీ ఇవ్వాలనుకుంటే ఎరుపు లేదా పింక్ రంగున్న గులాబీని ఇవ్వండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఎరుపు, పింక్ రంగుల గులాబీలు లక్‌కి చిహ్నం. ఈ గులాబీలను ఇచ్చినప్పుడు ఆ బంధం మరింత బలపడుతుందట. (vastu tips)
వాడిపోతున్న గులాబీలు అస్సలు ఇవ్వకండి
గులాబీలు వాడిపోతూ.. ఫ్రెష్‌నెస్ కోల్పోయినట్లు అనిపిస్తే వాటిని మీ పార్ట్‌నర్‌కు అస్సలు ఇవ్వకండి. అలాంటివి ఇచ్చే బదులు అసలు గులాబీలు ఇవ్వకపోవడమే మంచిది అని వాస్తు శాస్త్రం చెప్తోంది. ఇలా వడలిపోయి, వాడిపోయిన పువ్వులను ఇస్తే మీ బంధం దెబ్బతింటుందని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అలాంటి పువ్వులు నెగిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తాయి.
బేసి సంఖ్యలో పువ్వులను ఇవ్వాలట
పువ్వులను సరి సంఖ్యలలో కాకుండా బేసి సంఖ్యలలో ఇవ్వాలట. అంటే రెండు, నాలుగు కాకుండా మూడు, ఐదు ఇలా బేసి సంఖ్యల్లో ఉన్న పువ్వులను ఇస్తే మంచిది అని వాస్తు శాస్త్రం చెప్తోంది. బేసి సంఖ్యలు శుభ ఫలితాన్ని ఇస్తాయట. (vastu tips)
రెక్కలు లేనివి, తెగినవి ఇవ్వదు
గులాబీ పూలకు సగం రెక్కలు ఉండి సగం లేనట్లుగా ఉండేవి.. పువ్వుల కాడ తెగిపోయినట్లు ఉండేవి అస్సలు ఇవ్వకండి. అలా ఇస్తే ఏదో ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు అనుకుంటారు కానీ ప్రేమతో ఇచ్చారని గుర్తించరట.
తూర్పు, ఆగ్నేయం దిశల్లో పెట్టుకోండి
మీకు ఎవరి నుంచైనా గులాబీలు కానుకగా వస్తే వాటిని మీ గదిలోని తూర్పు, లేదా ఆగ్నేయ దిశల్లో పెట్టుకోండి. ఈ దిశల్లో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది.
కుడి చేత్తో ఇవ్వండి
మీరు మీ పార్ట్‌నర్‌కు గులాబీలు ఇవ్వాలనుకున్నా లేదా వారి నుంచి తీసుకోవాలనుకున్నా కుడి చేత్తో తీసుకుని ఇవ్వండి. ఎడమ చెయ్యిని అస్సలు వాడద్దు. కుడి చేతితో వస్తువులను ఇచ్చి పుచ్చుకుంటే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. మీరు ఎడమ చేత్తో ఇచ్చినా తీసుకున్నా ఇష్టం లేదనుకుంటారు. బంధాలు దెబ్బతినే పరిస్థితి ఎదురవుతుంది.
డార్క్ రంగుల గులాబీలు వద్దు
కొందరు కృత్రిమంగా పండించిన గులాబీలను అమ్ముతుంటారు. ఇవి చూడటానికి బాగుంటాయి కానీ కానుకలుగా ఇవ్వడానికి ఏమాత్రం పనికిరావు. డార్క్ రంగుల్లో ఉండే గులాబీలను కానుకలుగా ఇవ్వద్దు. ఆ రంగులు బ్యాడ్ వైబ్స్ కలిగేలా చేస్తాయి. ఎప్పుడైనా లేత రంగుల గులాబీలు ఇవ్వాలి.
శుభ్రమైన ప్రాంతాల్లో పెట్టండి
మీకు ఎవరైనా గులాబీలు ఇచ్చినట్లతే వాటిని ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి. శుభ్రమైన ప్రదేశాల్లో అందంగా అలంకరించినట్లు పెట్టుకోండి. అప్పుడు వారు ఇచ్చిన కానుకకు విలువ ఉంటుందని గుర్తుంచుకోండి.
ఇచ్చే సమయం కూడా ముఖ్యమే
మీ పార్ట్‌నర్ ఏ విషయంలోనైనా బాధపడుతున్నప్పుడో వారి మూడ్ బాలేనప్పుడో గులాబీలు ఇవ్వకండి. అలా ఇస్తే వారి ఫీలింగ్స్‌ని పట్టించుకోని వారిగా మిగిలిపోతారు.
ఇలాంటి చిన్న చిన్న విషయాలను గుర్తుపెట్టుకుంటే మంచిది అని వాస్తు శాస్త్రం చెప్తోంది. చాలా మంది రోజ్ డే అంటే ఆ ఏముందిలే ఏదో ఒక గులాబీ కొని ఇచ్చేస్తే అయిపోతుంది అనుకుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే అన్నీ పాటించి తమ బంధం ఎప్పటికీ విడిపోకుండా ఉండాలని కోరుకుంటూ ఉంటారు.