Vastu: ఈ టిప్స్ మాన‌సిక ఆరోగ్యం కోసం ..!

Hyderabad: శారీర‌క ఆరోగ్యం ఎంత ముఖ్య‌మో దానికి వంద రెట్లు మాన‌సిక ఆరోగ్య‌మూ(mental health) ముఖ్య‌మేన‌ని వైద్యులు చెప్తూనే ఉన్నారు. వాస్తుకి(vastu) మాన‌సిక ఆరోగ్యానికి కూడా సంబంధం ఉంటుంద‌ని నిపుణులు అంటున్నారు. ఏ టిప్స్ పాటిస్తే మాన‌సికంగా స్ట్రాంగ్‌గా ఉంటారో తెలుసుకుందాం.

*సాధారణంగా మానసిక ఆరోగ్యానికి ఉత్త‌మ‌మైన‌ది ప్ర‌క్రియ మెడిటేష‌న్. ఈ మెడిటేష‌న్‌ను ఎక్క‌డ ప‌డితే అక్క‌డ చేయ‌లేరు. చేసినా మ‌న‌సు కుదుట‌గా ఉండ‌దు. ఇంట్లో మెడిటేష‌న్ చేసుకునేవారు తూర్పు వైపు కానీ ఈశాన్య వైపు కానీ కూర్చోవాలి. ఈ దిశ‌ల్లో పాజిటివ్ ఎన‌ర్జీ ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌.

*మీ ఇంట్లోని హాల్ కాస్త విశాలంగా ఉంటే మ‌న‌సు ఆహ్లాద‌క‌రంగా ఉంటుంద‌ట‌. ఏ రూం నుంచి హాల్‌లోకి వ‌చ్చినా ఏదో తెలీని పాజిటివ్ ఫీలింగ్ క‌లుగుతుంద‌ని నిపుణుల అభిప్రాయం.

*సొంత ఇల్లు ఉన్న‌వారైతే గోడ‌ల‌కు లేత రంగులు ఉండేలా చూసుకోండి. కుదిరిన‌ప్పుడ‌ల్లా క్యాండిల్స్, అగ‌ర‌బ‌త్తీలు వెలిగించండి. మీకు నచ్చిన బొమ్మ‌లు కూడా పెట్టుకోవ‌చ్చు.

*ప్ర‌ధాన ద్వారం తెరిచేట‌ప్పుడు లేదా మూసేట‌ప్పుడు సౌండ్ రాకూడ‌దు. ద్వారం ముందు బాత్రూం కానీ, డ‌స్ట్‌బిన్ కానీ షూ ర్యాక్ కానీ అస్స‌లు ఉండ‌కూడ‌దు.

*మ‌నం రెస్ట్ తీసుకునేది బెడ్‌రూంలో కాబ‌ట్టి.. గ‌దిని ఆహ్లాద‌క‌రంగా మార్చుకోండి. చింద‌ర‌వంద‌ర‌గా ఉంటే ఎక్క‌డ‌లేని ఇరిటేషన్ వ‌చ్చేస్తుంది. నిద్ర‌పోయేట‌ప్పుడు మీ త‌ల తూర్పు వైపు కానీ ద‌క్షిణం వైపు కానీ ఉండాలి.

ఇవి వాస్తు నిపుణుల నుంచి సేక‌రించిన అభిప్రాయాలు మాత్ర‌మే