Vastu: అదృష్టాన్ని తెచ్చిపెట్టే వంట సామాను..!
Vastu: వాస్తు ప్రకారం మన వంట గదిలో ఉన్న మసాలా వస్తువులతోనే మనం అదృష్టాన్ని పెంపొందించుకోవచ్చట. అదెలాగో చూసేద్దాం రండి.
పసుపు (turmeric)
పసుపు మంగళకరం. పసుపు రంగు చూడగానే ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. పసుపు బృహస్పతికి సంబంధించినది. అందుకే ఇంట్లో పసుపు నీళ్లు చల్లినా పసుపును దేవుడి పూజలో వాడినా నెగిటివిటీ అంతా పోతుంది. స్నానం చేసే సమయంలో బకెట్లో కాస్త పసుపు వేసుకుని చేస్తే అనుకున్న పనులు నెరవేరతాయంట.
యాలకులు (cardamom)
ఏదైనా ముఖ్యమైన పనిమీద వెళ్లటప్పుడు నోట్లో రెండు యాలకులు వేసుకుని వెళ్లాలంటారు. దిండు కింద రెండు యాలకులు పెట్టుకుని నిద్రపోయినా కూడా లక్ కలిసివస్తుందట.
లవంగాలు (cloves)
బ్యాడ్ లక్ నుంచి లవంగాలు మనల్ని దూరంగా ఉంచుతాయట. నెగిటివిటీని కూడా తొలగిస్తాయని వాస్తు శాస్త్రం చెప్తోంది. ఇంటి మూలల్లో కాస్త లవంగాలను ఓ వస్త్రంలో చుట్టి పెట్టండి. మీ వాలెట్, పర్సుల్లో కూడా రెండు మూడు లవంగాలను వేసి ఉంచుకుంటే మంచిది.
బిరియానీ ఆకు (bay leaf)
బిరియానీ ఆకులపై మీ కోరికలను రాసి వాటిని కాలిస్తే త్వరగా అనుకున్నవి జరుగుతాయని నిపుణులు కూడా చెప్తుంటారు.
చెక్క (cinnamon)
మీకు మీ పర్సులో ఐదారు లవంగాలు పెట్టుకునే అలవాటు ఉంటే వాటిలో ఒక చెక్క కూడా వేయండి. చెక్క అనేది మనం జీవితంలో సక్సెస్ అవ్వడానికి కావాల్సిన వైబ్రేషన్లను కలిగిస్తుందట.
ఇదంతా చదివాక కాస్త బియ్యం వేసి బిరియానీ చేసేస్తే అయిపోతది అనుకునే వారు కూడా ఉంటారు. మనం చేసే ప్రయత్నం చేయాలి. దైవానుగ్రహం కూడా ఉండాలి. దానికి విశ్వం కూడా మనకు సాయపడాలి. అందుకే ఈ వాస్తు చిట్కాలు చెప్తుంటారు. మనకు కావాల్సిన దాని కోసం కృషి చేయకుండా నాలుగు లవంగాలు, చెక్క పెట్టుకుంటే కుదరదు కదా..!