New Year కి వాస్తు ప్రకారం ఎలాంటి గిఫ్ట్‌లు ఇవ్వాలి?
New Year: కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. స్నేహితులకు, ప్రేమికులకు, పార్ట్‌నర్స్‌కు కానుకలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. అయితే ఇతరులకు నచ్చే కానుకలు కాకుండా వాస్తు ప్రకారం వారికి ఏవి ఇస్తే బాగుంటుందో తెలుసుకుందాం.
వినాయకుడి విగ్రహం
విఘ్నాలను హరించేవాడు విఘ్నేశ్వరుడు. నూతన సంవత్సరాన్ని ఆయన ఆశీస్సులతో ప్రారంభించడం కంటే విశేషం ఇంకేముంటుంది. ఒకవేళ మీరు ఎవరికైనా కానుకలు ఇవ్వాలనుకుంటే చిన్న వినాయకుడి బొమ్మను ఇవ్వండి. వినాయకుడి విగ్రహాన్ని ఒకరి నుంచి తీసుకున్నా లేదా మీరు ఎవరికైనా ఇచ్చినా కూడా ఎంతో మంచిది.
శ్రీమేరు యంత్రం
వాస్తు యంత్రాల్లో అత్యంత శక్తిమంతమైనది శ్రీమేరు యంత్రం. ఈ యంత్రం ఇంట్లో ఉంటే వాస్తు ప్రకారం ఎన్నో లాభాలు కలుగుతాయి.
ఏనుగుతో పాటు ఉన్న తాబేలు బొమ్మ
ఏనుగు బొమ్మ పక్కనే తాబేలు పెట్టి ఉన్న బొమ్మలు దొరుకుతాయి. జ్ఞానం, విజయానికి చిరునామా ఏనుగు. ఇక తాబేలు బొమ్మ ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీలు అన్నీ పోతాయి. అంతా మంచే జరుగుతుంది.
లాఫింగ్ బుద్ధుడు
లాఫింగ్ బుద్ధుడి విగ్రహాలను కూడా కానుకగా ఇస్తే మంచిది. ఇచ్చేవారికి తీసుకునేవారికి మంచే జరుగుతుంది. లాఫింగ్ బుద్ధా విగ్రహం ఇంట్లో ఉంటే అప్పుడప్పుడూ బుద్ధుడి బొజ్జపై రుద్దుతూ ఉండాలి. ఇలా చేస్తే మంచిదట. ఇంట్లో దాదాపు ఆరు రకాల లాఫింగ్ బుద్ధ విగ్రహాలు పెట్టుకుంటే శుభం కలుగుతుందట.
గోమతి చక్ర మొక్క
ఇంట్లో గోమతి చక్ర మొక్క ఉంటే వాస్తు ప్రకారం ఎంతో మంచిది. కొందరు ఇల్లు కట్టుకునేటప్పుడు పునాది వేసే సమయంలో ఈ మొక్కను పాతిపెట్టి దానిపై ఇల్లు కట్టుకుంటారు.