Vastu: ఇల్లు ఇలా ఉంటే.. లక్ష్మీదేవి కొలువై ఉంటుందట!
Hyderabad: ఈ టిప్స్ పాటిస్తే లక్ష్మీదేవి(lakshmi devi) ఇంట్లోనే కొలువై ఉంటుందని వాస్తు(vaastu) నిపుణులు చెప్తున్నారు. ఆ టిప్స్ ఏంటో చూద్దాం.
- ప్రధాన గుమ్మం ఎప్పుడూ ఉత్తరం వైపు ఉండాలట. అదీకాకుండా తలుపు లోపలికి తీసేలా ఉండాలి కానీ బయటికి కాదు.
- ఇంట్లో అద్దాలు కూడా ఉత్తరం వైపు పెట్టి ఉంచాలంటున్నారు వాస్తు నిపుణులు. లాకర్ ముందు ఓ చిన్న అద్దం ఉండేలా చూసుకోండి. లాకర్‌లో ఉన్న డబ్బు అద్దంలో రిఫ్లెక్ట్ అయితే ఇంకా మంచిదట.
- పర్పుల్ కలర్ డబ్బుని అట్రాక్ట్ చేస్తుంది అంటారు. మీరు డబ్బు పెట్టే గది గొడలు పర్పుల్ రంగులో ఉంటే మంచిది. మీరు డబ్బు పెట్టుకునే లాకర్ కూడా పర్పుల్ కలర్‌లో ఉంటే మరీ మంచిది.
- వంటిల్లు కూడా ఉత్తరం వైపు కానీ ఈశాన్యం(నార్త్ ఈస్ట్) వైపు ఉండాలి. మంచి ఎనర్జీ లభిస్తుంది.
- బాత్రూం ఎప్పుడూ నైరుతి(సౌత్ వెస్ట్) వైపు ఉండకూడదు. ఆర్థిక నష్టాలు వాటిల్లుతాయట.
- వాటర్ ట్యాప్‌లు, పైప్‌లు తూర్పు లేదా ఉత్తరం దిశగా అమర్చి ఉండాలి.
- ఇంట్లో పగిలిపోయి అద్దాలు, గడియారాలు లేకుండా చూసుకోండి.
ఇవి వాస్తు నిపుణుల అభిప్రాయాలు మాత్రమే