Spiritual: నెమలి పింఛం ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో..!
Spiritual: మనం చిన్నప్పుడు పుస్తకాల్లో నెమలి పింఛం పెట్టుకునేవాళ్లం. పుస్తకంలో పెట్టుకుంటే మనకు బాగా చదువు వస్తుందని అనుకునేవాళ్లం. పుస్తకాల్లో పెట్టుకుంటే ఏం వస్తుందో తెలీదు కానీ ఇంట్లో పెట్టుకుంటే వాస్తు పరంగా బాగా కలిసొస్తుందని అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇంతకీ ఈ నెమలి పింఛం ఇంట్లో ఉండటం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం.
*ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలైనా ఉంటే తొలగిపోతాయి. ఓం సోమాయ నమః అని జపిస్తూ ఒక 8 నెమలి పింఛాలను తెల్ల దారంతో కట్టి ఇంట్లో వేలాడదీస్తే వాస్తు దోషాలు పోతాయి.
*శని వల్ల కలిగే ఇబ్బందులు తొలగిపోతాయి. ఇందుకోసం మూడు నెమలి పింఛాలను నల్ల దారంతో కట్టి ఇంట్లో వేలాడదీస్తే మంచిది. ఆ పింఛంపై గంగాజలం చల్లుతూ ఓం శనీశ్వరాయై నమః అని 20 సార్లు జపించాలి.
*దంపతులు నిద్రపోయే గదిలో చక్కటి నెమలి ఫోటో ఉంటే వారి వైవాహిక జీవితం బాగుంటుందట.
*కార్యాలయాల్లో కూడా నెమలి పింఛాలను పెట్టుకుంటే ఎంతో మంచిది. ఈ పింఛాలను ఎక్కడ పెట్టినా కూడా వాటిపై దుమ్ము ధూళి లేకుండా చూసుకోవాలి.
*ఒంట్లోని విష పదార్థాలను తొలగించే శక్తి నెమలి పింఛాలకు ఉంటుందట. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
*మీ ఇంట్లో లాకర్ ఉంటే దానికి దగ్గర్లోనే ఒక నెమలి పింఛాన్ని పెట్టుకోండి. ఇంటి ముందు నెమలి పింఛాలను పెట్టుకుంటే నెగిటివ్ శక్తులు ఇంట్లోకి దరిచేరవు.