Spiritual: రుద్రాక్షలు ఎన్ని రకాలు? వాటి లాభాలేంటి?
Spiritual: రుద్ర అంటే శివుడు, అక్ష అంటే కన్నీరు. శివయ్య కన్నీటిబొట్లు రుద్రాక్షలుగా మారాయని పురాణాలు చెప్తున్నాయి. మనకు తెలిసి రుద్రాక్ష అనేది ఒకే రకం ఉంది. కానీ రుద్రాక్షలో 21 రకాలు ఉన్నాయట. శారీరక, మానసిక రుగ్మతలను నయం చేసే శక్తి ఈ రుద్రాక్షలకు ఉంది. అసలు ఈ రుద్రాక్షలో ఎన్ని రకాలు ఉన్నాయి? వాటిని ధరించడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం.
ఏక, ద్విముఖి రుద్రాక్ష
ఈ రుద్రాక్షను ధరిస్తే సూర్య భగవానుడి కృప ఎల్లప్పుడూ ఉంటుంది. మైగ్రేన్, డిప్రెషన్‌ను తొలగించే శక్తి ఈ రుద్రాక్షలకు ఉంది. ముఖ్యంగా చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్న విద్యార్ధులకు ఈ రుద్రాక్షలు ఎంతో మంచివి.
త్రిముఖ, చతుర్ముఖ రుద్రాక్ష
ఈ రుద్రాక్షలకు అధిపతి కుజుడు. ఈ రుద్రాక్ష ధరిస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గత జన్మల్లో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి.
పంచ ముఖి, షణ్ముఖి రుద్రాక్ష
ఈ రెండు రుద్రాక్షలకు అధిపతులు బృహస్పతి, కార్తికేయ. పంచ ముఖిని పంచ పాండవులతో పోలుస్తారు. ఆర్థికంగా వృద్ధిచెందేందుకు పంచ ముఖి రుద్రాక్షను ధరిస్తారు. ఇక షణ్ముఖి రుద్రాక్ష డయాబెటిస్, యాంగ్జైటీ, థైరాయిడ్ వంటి సమస్యలను తొలగిస్తుంది. జాతకంలో మంగళ దోషం ఉంటే పోతుంది.
సప్త ముఖి, అష్ట ముఖి రుద్రాక్ష
శుక్రుడు, కేతువులు ఈ రుద్రాక్షలకు అధిపతులు. సప్త ముఖి శరీరంలోని ఏడు చక్రాలను కదిలించి ఆధ్మాత్మిక భావన పెరిగేలా చేస్తుంది. ఇక అష్ట ముఖి రుద్రాక్ష జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనేందుకు తోడ్పడుతుంది. ఊపిరితిత్తుల సమస్యలు కూడా ఈ రుద్రాక్ష వేసుకుంటే నయమవుతాయని పెద్దలు చెప్తుంటారు.
నవ ముఖి, దశ ముఖి రుద్రాక్షలు
నవ ముఖికి అధిపతి రాహువు. రాహు ప్రభావం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న వారికి నవ ముఖి రుద్రాక్ష ఎంతో మేలు చేస్తుంది. చేతబడి వల్ల బాధింపబడి ఉంటే ఆ ప్రభావం కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఇక దశముఖికి అధిపతి అంటూ ఎవ్వరూ లేరు. తొమ్మిది గ్రహాలకు సంబంధించిన చెడు ప్రభావం మనపై పడకుండా ఈ దశముఖి రుద్రాక్ష ఎంతో మేలు చేస్తుంది. కోర్టు కేసులు, అప్పుల బాధలు ఉంటే ఈ రుద్రాక్ష వాటిని తొలగిస్తుంది.
ఏకాదశ ముఖి – కుజుడు – హనుమంతుడు
ద్వాదశ ముఖి – సూర్య భగవానుడు
త్రయోదశ ముఖి – శుక్రుడు, చంద్రుడు
చతుర్ధశ ముఖి – కుజుడు, శని
పంచదశ ముఖి – బుధుడు
షోదశ ముఖి – చంద్రుడు
సప్తదశ ముఖి – శని
అష్టాదశ ముఖి – విశ్వకర్మ, కాత్యాయిని
నవదశ ముఖి – విష్ణుమూర్తి, బుధుడు
దింశతి ముఖి – బ్రహ్మస్వరూపుడు
ఏకవింశతిహి ముఖి – కుబేరుడు