Shravana Masam: ఈసారి ప్రత్యేకత ఏంటో తెలుసా?
Hyderabad: శ్రావణ మాసం వచ్చేసింది. ఆగస్ట్ 31 వరకు శ్రావణ మాసం (shravana masam) ఉంటుంది. ఈ ఏడాది వచ్చిన ఈ శ్రావణ మాసం ఎంతో ప్రత్యేకం. ఎందుకో తెలుసా? ఈసారి శ్రావణ మాసం 59 రోజులు ఉండబోతోంది. అంటే ప్రతి సంవత్సరం నాలుగు శ్రావణ సోమవారాలే వస్తాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం 8 సోమవారాలు ఉండబోతున్నాయి. ఇలా దాదాపు 19 ఏళ్ల తర్వాత జరగడం ఎంతో ప్రత్యేకం. అధిక మాసం రెండు సార్లు రావడం వల్ల శ్రావణ మాసం (shravana masam) 58 రోజుల పాటు ఉంటుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.
మన తెలుగువారైతే ప్రతి శ్రావణ సోమవారం (shravana somwar) నాడు ఉపవాసం ఉండటం, శివపార్వతుల నామస్మరణతో వ్రతాలు చేసుకుంటాం. అటు నార్త్ రాష్ట్రాల్లో అయితే.. కన్వరియా యాత్రల్లో పాల్గొంటారు. శివభక్తులను కన్వరియాలు అంటారు. కన్వరియా (kanwariya) యాత్ర అంటే ఆరెంజ్ రంగు దుస్తులు వేసుకుని పవిత్ర నదుల నుంచి కుండల్లో జలాలను తీసుకుని ప్రముఖ శివాలయాలకు వెళ్తుంటారు.