Investment: ఐదేళ్లకు 2 లక్షలకు పైగా వడ్డీ..!
Hyderabad: తక్కువ సమయంలో కాస్త ఎక్కువ మొత్తంలో ప్రాఫిట్ అర్జించాలనుకునేవారికి ఈ పోస్ట్ ఆఫీస్ స్కీం(post office scheme) బాగా పనికొస్తుంది. ఈ మధ్యకాలంలోనే కేంద్ర ప్రభుత్వం చిన్న సేవింగ్ ప్లాన్ల వడ్డీ రేట్లలో పలు మార్పులు తీసుకొచ్చింది. ఏప్రిల్ 1 నుంచి ఈ ప్లాన్లు అమల్లో ఉన్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF) మినహా అన్ని సేవింగ్ ప్లాన్ల వడ్డీ రేట్లు 7 నుంచి 10 బేసిస్ పాయింట్లకు పెరిగాయి. కొన్నేళ్లలో ఎలాంటి రిస్కులు లేకుండా చక్కటి వడ్డీ రేట్లు వచ్చే ఈ పోస్ట్ ఆఫీస్ స్కీం ఏంటో చూద్దాం.
దీనిని పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ అంటారు. ఎక్కువగా ఇలాంటి స్కీంలలో చిన్న ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతుంటారు. పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్లో ఐదేళ్ల ఇన్వెస్ట్‌మెంట్‌కు గానూ ప్రభుత్వం వడ్డీ రేట్లను 7 నుంచి 7.5%కి పెంచింది. ఇందులో పొదుపు చేసుకోవాలి అనుకునేవారు 1, 2, 3 లేదా 5 ఏళ్ల సమయం వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మెచ్యూరిటీ తర్వాత మరో ఏడాదికి పొడిగిస్తారు కూడా. ఈ టైం డిపాజిట్ స్కీంలో సింగిల్ లేదా జాయింట్ ఖాతాల్లో మాగ్జిమం ముగ్గురిని యా్ చేసుకోవచ్చు. ఖాతా తెరవడానికి వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ఇన్వెస్ట్మెంట్ క్యాప్ కూడా ఏమీ ఉండదు.
ఈ ఖాతాను ఎవరు తెరవచ్చంటే
18 ఏళ్లు పైబడిన వ్యక్తి
మైనర్‌కు గార్డియన్‌గా ఉన్న వ్యక్తి వారి పేరు మీద తీసుకోవచ్చు
మతిస్థిమితం లేని వ్యక్తికి గార్డియన్‌గా ఉన్నవారు తీసుకోవచ్చు
జాయింట్ ఖాతా అయితే ముగ్గురు అడల్ట్స్ ఉండాలి.
5 ఏళ్లలో 6 లక్షల వరకు ఇన్వెస్ట్ చేస్తే రూ.2,69,969 వస్తాయి. అదే మెచ్యూరిటీ పీరియడ్ పూర్తయ్యాక తీసుకుంటే రూ.8,69,969 వస్తాయి. ఏదేమైనా ఇలాంటి విషయాల్లో అనుభవం ఉన్నవారి సలహాలు తీస్కోవడం మంచిది.