Spiritual: శివయ్య మనకు సంకేతాలు ఇస్తున్నారా?
Spiritual: మనకు జీవితంలో ఉన్నట్టుండి ఈ బ్రహ్మాండం నుంచి ఏవో సంకేతాలు వస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు మీకు ఉన్నట్టుండి దేవుడి పాటలు వినాలనిపించడం, త్రిశూలం వంటి గుర్తులు కనిపిస్తూ ఉండటం ఇవన్నీ శివయ్య మనకు ఇస్తున్న సంకేతాలేనట. ఇలాంటి సంకేతాలు, మార్పులు కనిపిస్తున్నట్లైతే శివయ్య ఆశీస్సులు మీపై ఉంటున్నాయని అర్థం.
*మీరు శివ భక్తుడు అయివుండి.. మీ జీవితంలో ఏదన్నా పాజిటివ్ మార్పులు వస్తున్నాయంటే దానికి అర్థం కూడా శివయ్య మీపై తన కన్నేసి ఉంచాడనే.
*సవాల్ చేసే సంఘటనల్లో మీరు ఉన్నప్పుడు ఎప్పుడూ లేని ధైర్యం మీలో ఉందంటే ఆ శివయ్యే మీతో ఉన్నట్లు లెక్క. క్లిష్ఠ సమయాల్లో నేను నీతో ఉన్నాను అని శివయ్య మీకు చెప్తున్నారని అర్థం.
*మీలో ప్రశాంతత పెరగడం.. గందరగోళ సందర్భాల్లో కూడా మీరు ప్రశాంతంగా మనసు పెట్టి ఆలోచిస్తున్నారా? దాని అర్థం కూడా శివయ్య మీతో ఉన్నారని తెలుసుకోవాలి.
*మీకు కలలో మాటిమాటికీ శివుడు కనిపిస్తున్నా మంచి శకునమే. మీరు ఊహించిన దానికంటే ఆయన కృప మీపై ఎక్కువ ఉందని అర్థం.
*శివ అన్న పిలుపు విన్నా.. శివుడి పేరును తలుచుకున్నా మీకు ప్రశాంతత లభిస్తోందంటే.. ఆయన ఆశీస్సులు మీపై ఎప్పటికీ అలాగే ఉంటాయని సంకేతం.