Hanuman: కంటతడి పెట్టే ఆంజనేయ స్వామి..!
Hyderabad: ప్రతి హనుమాన్ జయంతి రోజున ఓ ఆలయంలోని హనుమంతుడు (hanuman) కన్నీరుపెడతారట. ఈ వింత ఆలయం ఎక్కడుందో తెలుసా? కర్ణాటకలోని బన్స్వాడి ప్రాంతంలో. ఇంతకీ ఎందుకు ఇక్కడి హనుమంతుడు కంటతడి పెడతారు? అసలేంటీ ఆలయ విశేషాలు? తెలుసుకుందాం రండి.
వందేళ్ల క్రితం ద్రవిడ స్టైల్లో ఈ హనుమంతుడి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో హనుమంతుడితో పాటు రాముడు, శివుడు, గణనాథుడి ఆలయాలు కూడా ఉన్నాయి. అయితే కొన్నేళ్ల క్రితం.. ఈ ఆలయంలోని హనుమంతుడి కంట నుంచి నీరు రావడం ఆలయ పూజారి చూసారట. దాంతో ఆశ్చర్యపోవడం ఆయన వంతైంది. వెంటనే వీడియో తీసి వైరల్ చేయడంతో భక్తులతో ఆలయం నిండిపోయింది. స్వామివారిని చూసేందుకు భక్తులు వేల సంఖ్యలో రావడంతో రోడ్లన్నీ జనసంద్రం అయిపోయాయి. విషయం తెలిసి పోలీసులు భక్తులను కంట్రోల్ చేసేందుకు వచ్చారు. ఆ వీడియో ప్రభుత్వ దృష్టికి రావడంతో వెంటనే దానిని సర్క్యులేట్ చేయకుండా బ్లాక్ చేసేసారట. (hanuman)
హనుమంతుడు కన్నీరుపెట్టిన రోజు హనుమ జయంతి కావడం విశేషం. అప్పటినుంచి ప్రతి హనుమ జయంతి రోజున వేలల్లో భక్తులు ఈ బాన్స్వాడి హనుమంతుడి ఆలయాన్ని దర్శించుకునేందుకు వస్తుంటారు. అవి ఆనంద బాష్పాలు అని వాటిని తిలకించినవారి జన్మ ధన్యమవుతుందని భక్తుల నమ్మకం. (hanuman)