Love Marriage చేసుకునే ముందు ఇవి చూసుకోండి
Hyderabad: అరేంజ్డ్ మ్యారేజెస్ (arranged marriage) అంటే పెద్దలు అన్నీ ముందే మాట్లాడి చూసిపెడతారు. కానీ లవ్ మ్యారేజ్ (love marriage) అలా కాదు. అన్నీ ప్రేమించుకున్నవారే చూసి చేసుకోవాలి. ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకునేవారు ఈ విషయాల గురించి ముందే చర్చించి చేసుకుంటే ఆ బంధం చిరకాలం నిలుస్తుందని అంటున్నారు రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్.
మీ ఇద్దరిలో ఇండిపెండెన్స్‌ని బ్యాలెన్స్ చేసుకునే సామర్ధ్యం ఉందా? అంటే ఎప్పుడూ ఐలవ్యూ ఐలవ్యూ అని తిరగకుండా ఒకరిపై ఒకరు డిపెండ్ కాకుండా ప్రొఫెషనల్‌గా ఎలా ఎదగాలి అనేదాని గురించి చర్చించుకోండి. ఇద్దరూ సంపాదిస్తున్నట్లైతే ఎలా పొదుపు చేసుకోవాలో ఇద్దరూ కూర్చుని చర్చించుకోండి. అలా కాకుండా ఒకరు సేవ్ చేస్తూ మరొకరు ఖర్చు పెట్టే రకం అయితే గొడవలు తప్పవు. మీ కులాలు, మతాలు, సంప్రదాయాలు వేరైతే వాటిని తప్పక గౌరవించాల్సిందే. నేనెందుకు పాటించాలి నేనెందుకు గౌరవించాలి అనే మాట అస్సలు రాకూడదు. బంధం అన్నాక గొడవలు సహజం. వాటిని ఎలా పరిష్కరించుకున్నాం అనేదే ఇంపార్టెంట్. ఎలా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలో తెలిస్తే ఎన్ని గొడవలు వచ్చినా మిమ్మల్ని ఏవీ వేరు చేయలేవు.
ఇక మ్యాగ్జిమం గొడవలు ఇంటి బాధ్యతలను చూసుకునే దగ్గరే వస్తాయి. నువ్వే చూసుకోవాలి అంటే నువ్వే చూసుకోవాలి అనే ధోరణితో అస్సలు ఉండకండి. బాధ్యతలను షేర్ చేసుకోండి. ఒకరి నిర్ణయాలు ఒకరు గౌరవించుకోండి. ఇవన్నీ పెళ్లికి ముందు వరకు చేసేస్తాం చూసేస్తాం అన్నట్లే ఉంటాయి. కానీ పెళ్లయ్యాకే ప్రేమలో ఉన్నప్పుడు ఓకే అనిపించినవన్నీ భారంగా కనిపిస్తాయి. పెళ్లయ్యాక గొడవలు జరుగుతాయి అయినా విడిపోకుండా అర్థంచేసుకుని కాపురం చేసుకోవాలి అని ఇద్దరికీ బలంగా అనిపించినప్పుడే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టండి.