Evil Eye: వీటితో న‌ర‌ఘోష తొల‌గిపోతుంది

Evil Eye: మ‌న అభివృద్ధిని నిరోధించి.. మ‌న‌కు క‌ష్టాల‌ను క‌లిగించి.. మ‌న‌ల్ని ఇబ్బందుల‌కు గురిచేస్తూ మ‌న‌శ్శాంతి లేకుండా చేసే న‌ర‌ఘోష ఏదైతే ఉందో దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. ల‌క్ష్మీ క‌టాక్షం ఎంతున్న కూడా న‌ర‌ఘోష ఉంటే రాణింపు ఉండ‌దు. న‌ర‌ఘోష‌కు నివార‌ణ త‌ప్ప‌నిస‌రి. ఎప్పుడూ కూడా మ‌న‌కు ల‌క్ష్మీ క‌టాక్షంతో పాటు న‌ర‌ఘోష నివార‌ణ కూడా కోరుకోవాల్సిందే. ఇంటి నిండా డ‌బ్బులు ఐశ్వ‌ర్యం ఉంది.. కానీ ఒంటి నిండా రోగాలు ఉంటే ఏం అనుభ‌వించ‌గ‌లం? కావాల్సినంత సొమ్ము ఉన్నా కూడా అనుభ‌వించేందుకు ఆరోగ్యం లేక‌పోతే ఆ డ‌బ్బుకు విలువ ఏముంది? ఐశ్వ‌ర్యం అంటే డ‌బ్బు, న‌గ‌లు మాత్రమే కాదు.

మ‌నం సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నామంటే అంత‌కు మించిన ఐశ్వ‌ర్యం మ‌రొక‌టి లేద‌నే చెప్పాలి. అష్టైశ్వ‌ర్యాలు అంటే భార్య‌తో, పిల్ల‌ల‌తో క‌లిసి ఉండ‌టం, మ‌న‌శ్శాంతి, ఆరోగ్యం, వృత్తి రిత్యా అభివృద్ధిలో ఉండ‌టం. ఎంత సంపాదించినా కూడా క‌లిసి రాక‌పోతే మ‌హా చికాకుగా ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. మీ ద‌గ్గ‌ర డ‌బ్బుకి కొద‌వ లేదు. అయినా ఇంట్లో ఏదో ఒక స‌మ‌స్య ఉంటుంది. ఆ స‌మ‌స్య డ‌బ్బుతో తీరేది కాదు. ఇలాంటి ప‌రిస్థితి ఉందంటే క‌చ్చితంగా అది న‌ర‌ఘోష అని అర్థం చేసుకోవాలి. (Evil Eye)

మ‌రి ఈ న‌రఘోష పీడ ఎలా పోతుంది?

న‌ర‌ఘోష నివార‌ణ జ‌ర‌గాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. ఇంట్లో గంటానాథం వినిపిస్తూ ఉండాలి. అంటే గంట శ‌బ్దం వినిపిస్తూ ఉండాలి. ఈ గంటానాథం న‌ర‌ఘోష‌కు విరుగుడుగా ప‌నిచేస్తుంది. ఇంట్లో ఎప్పుడూ 8 గ‌వ్వ‌లు ఉండాలి. అవి కూడా తెల్ల గ‌వ్వ‌లు అయ్యి ఉండాలి. ఇవి దేవుడి గ‌దిలో ఓ క‌ప్పులో వేసి ఉంచండి.

వాటిపై కాస్త గంధం, కుంకుమ వేసి ఉంచండి. ఆ గ‌వ్వ‌ల‌కు ప్ర‌తి రోజూ అగ‌ర‌బ‌త్తులు, హార‌తి చూపిస్తూ ఉండండి. పువ్వులు, తుల‌సి, మారేడు ద‌ళాల‌తో పూజిస్తూ ఉండండి. ఆ గ‌వ్వలు మీకు ఇంటి మీద‌కు వ‌చ్చే న‌ర‌ఘోష‌ను కొంత వ‌ర‌కు తగ్గిస్తుంది. గోమ‌తి చ‌క్రాలు కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇంట్లో ఒక్క గోమ‌తి చ‌క్రం తెచ్చుకుని ఇంట్లో పూజ చేసి పెట్టుకున్నా కూడా ఎంతో మంచిది.

దాంతో పాటు ప్ర‌తి రోజూ ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయ‌గ‌లిగితే న‌రఘోష ప‌టా పంచ‌లు అయిపోతుంది. రోజూ దీపం వెలిగించేట‌ప్పుడు నువ్వుల నూనెతో దీపారాధ‌న చేస్తే ల‌క్ష్మీ దేవి ప్ర‌వేశిస్తుంది. అయితే నువ్వుల నూనె పేరుతో మార్కెట్‌లో చాలా అమ్మేస్తున్నారు. పూజ నూనె, పూజ‌కు వాడే నూనె అని ర‌క‌ర‌కాలుగా ఏవి ప‌డితే అవి అమ్ముతుంటారు. వాటిని తెచ్చి పూజిస్తే ఫ‌లితం ఉండ‌దు. స్వ‌చ్ఛ‌మైన నువ్వుల నూనెతో పూజిస్తేనే ఆ పూజ‌కు ఒక అర్థం ఉంటుంది. ఎన్ని పూజ‌లు చేసినా మ‌న‌శ్శాంతి లేదు అనుకున్న ప‌నులు అవ్వ‌డంలేదు అంటే ముందుగా మీరు చెక్ చేసుకోవాల్సింది పూజ‌కు ఉప‌యోగిస్తున్న వ‌స్తువులు ఒరిజిన‌లా కాదా అని.

దేవుడి పూజ‌కు ఎప్పుడూ కూడా స్వ‌చ్ఛ‌మైన చ‌క్క‌టి ప‌దార్థాలు వాడాలి. మ‌నం పూజ‌కు వాడే ద్ర‌వ్యాలు మంచివి అయ్యి ఉండాలి. క‌ల్తీ నూనెల‌తో దీపారాధ‌న‌లు చేస్తే క‌ష్టాలు క‌డ‌తేర‌వు. దీప సెమ్మెలు, చెంబు, గంట‌, ఆచ‌ర‌ణ సామాగ్రి, ఏక హార‌తి.. ఇలాంటి సామాగ్రిని ఎప్ప‌టిక‌ప్పుడు క‌డుతూ ఉండాలి. ఎలా ప‌డితే అలా చేయ‌కూడ‌దు. పూజ విష‌యానికొస్తే చాలా మంది ఒక రొటీన్ డైలాగ్ చెప్తుంటారు. పూజ ఎలా చేస్తే ఏంటి.. స్వ‌చ్ఛమైన నిర్మల‌మైన మ‌న‌సుతో చేసామా లేదా అన్న‌దే ముఖ్యం. ఇలాంటివి చెత్త మాట‌లు చెప్పేవారికి దూరంగా ఉండండి. భ‌క్తితో పూజ చేస్తే స‌రిపోదు.. మ‌నం పూజ చేస్తున్న ప్రాంతాన్ని కూడా శుద్ధిగా ఉంచుకోవాలి.